కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం : కాలిబూడిదైన వాహనాలు.. ప్రమాదమా, ఆకతాయిల పనా..?

By Siva KodatiFirst Published Jan 15, 2023, 9:35 PM IST
Highlights

విశాఖ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో  వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు ఖాళీ బూడిదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.కోటి వుంటుందని తెలుస్తోంది.
 

విశాఖ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలను కంచరపాలెం పీఎస్‌ వెనుక పార్క్ చేసి వుంచారు. ఈ క్రమంలో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ వాహనాలన్నీ ఖాళీ బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే పార్కింగ్ లాట్‌లో అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా.. లేక ఆకతాయిలా పనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కనే ఇండస్ట్రియల్ డంపింగ్ యార్డు కూడా వుండటంతో అటు వైపు నుంచి మంటలు ఏమైనా అంటుకున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. మొత్తం 27 బైకులు, నాలుగు కార్లు, ఆటో దగ్ధమయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.కోటి వుంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

click me!