ఈ నెల 27 నుండి లోకేష్ పాదయాత్ర: తిరుపతిలో ప్రత్యేక పూజలు చేయనున్న టీడీపీ నేత

By narsimha lodeFirst Published Jan 15, 2023, 4:58 PM IST
Highlights

ఈ నెల  27వ తేదీనుండి లోకేష్ పాదయాత్ర నిర్వహించనున్నారు పాదయాత్ర ప్రారంభానికి ముందే  లోకేష్   తిరుమల వెంకన్నను సందర్శించుకుంటారు. 
 

అమరావతి: పాదయాత్రకు రెండు రోజుల ముందే  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  తిరుపతికి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి  వెంకటేశ్వరస్వామిని దర్శించుకంటారు.  ఈ నెల  27వ తేదీ నుండి  400 రోజుల పాటు  లోకేష్ పాదయాత్ర నిర్వహించనున్నారు. 

ఈ నెల  25న  లోకేష్ హైద్రాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద  ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తారు.  ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తర్వాత ఆయన  అదే రోజున రాత్రి  తిరుపతికి చేరుకుంటారు.  కుటుంబసభ్యులతో కలిసి  తిరుపతి వెంకన్నను  లోకేష్ దర్శించుకుంటారు.  తిరుపతి నుండి  లోకేష్  ఈ నెల  26వ తేదీన  కుప్పం చేరుకుంటారు.  పాదయాత్రకు  ఒక్క రోజు ముందే  లోకేష్ కుప్పం చేరుతారు. ఈ నెల  27వ తేదీ మధ్యాహ్నం  లోకేష్ పాదయాత్రను ప్రారంభిస్తారు. కుప్పంలోని వరదరాజుస్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు లోకేష్. ఆలయంలో  పూజలు నిర్వహించిన తర్వాత లోకేష్ పాదయాత్రను  ప్రారంభించనున్నారు. 

400 రోజుల పాటు  లోకేష్ యువగళం పేరుతో  పాదయాత్ర నిర్వహించనున్నారు.  రాష్ట్రంలోని కనీసం  వంద అసెంబ్లీ నియోజకవర్గాల గుండా  ఈ యాత్ర సాగనుంది. 4 వేల కి.మీ పాదయాత్ర చేయాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.  రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి పాదయాత్ర లేదా సైకిల్ యాత్ర చేయాలని లోకేష్ ప్లాన్ చేశారు.. కానీ ఏదో ఒక కారణాలతో  సైకిల్ యాత్ర పాదయాత్ర వాయిదా పడింది.  ప్రస్తుతం  ఏపీలో  ఎన్నికలకు  ఏడాది సమయం ఉంది. దీంతో  రాష్ట్రంలో  పాదయాత్ర చేయాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటికే  రూట్ మ్యాప్ లను సిద్దం చేశారు. 2014  ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  పాదయాత్ర నిర్వహించారు. వస్తున్నా మీ కోసం పేరుతో ఈ పాదయాత్ర  చేశారు.  ఈ పాదయాత్ర  సందర్భంగానే పంట రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు.  పాదయాత్రలో ప్రజల సమస్యలను  తెలుసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో  పలు అంశాలను  టీడీపీ పెట్టింది.  2014 ఎన్నికల్లో  ఏపీలో  టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసింది. తెలంగాణలో  15 అసెంబ్లీ,  ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా  గెలుచుకొంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  2004 ఎన్నికలకు ముందు  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర  ఆనాడు ఏపీలో  కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు  దోహదపడిందని  చెబుతారు. ఈ పాదయాత్ర తర్వాత  కాంగ్రెస్ సీనియర్లు బస్సు యాత్ర నిర్వహించారు.  

also read:4 వేల కి.మీ, 400 రోజుల యాత్ర: యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర

రాష్ట్ర విభజన తర్వాత  2014 తర్వాత  అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర తర్వాత   2018లో  జరిగిన  ఎన్నికల్లో  ఏపీలో  వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.  ప్రస్తుతం  వైసీపీ అధికారంలో ఉంది.  మరో ఏడాదిలో  ఏపీలో  ఎన్నికలు రానున్నాయి. దీంతో  లోకేష్ పాదయాత్రకు ప్లాన్  చేసుకున్నారు. 
 

click me!