
ఏలూరు : Eluru జిల్లాలోని మద్దూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో బుధవారం రాత్రి భారీ fire accident చోటుచేసుకుంది. పోరస్ రసాయన పరిశ్రమలోని యూనిట్ 4లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఆరుగురు మృతిచెందారు. ఘటనా స్థలంలోనే అయిదుగురు సజీవదహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. బాధితులను మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకువెళ్లారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన కొంతసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో షిఫ్ట్ లో 150 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు ఎస్పి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ రసాయన పరిశ్రమలో ఔషధాల్లో వాడే పొడిని తయారు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, మార్చి 23నతెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లోని ఓ టింబర్ డిపోలో ఇలాంటి అగ్ని ప్రమాదమే జరిగింది. బోయిగుడాలో భారీ fire accident చోటు చేసుకుంది. బోయిగుడాలోని Timber Depotలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో టింబర్ డిపోలో 12 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. టింబర్ డిపోలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 11 మంది సజీవదహనమయ్యారు. 11మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడినట్లు తెలుస్తోంది. ఊపిరి తీసుకోవడానికి అతను ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. జనావాసాల మధ్య ఈ టింబర్ డిపో ఉంది. చుట్టుపక్కల ఇళ్లవాళ్లను పోలీసులు ఖాళీ చేయించారు. బీహార్ నుంచి వచ్చిన కార్మికులు ఈ ప్లాస్టిక్ గోడౌన్ లో పనిచేస్తున్నారు. ఈ ఘటనలో సజీవ దహనమైన 11 మంది కార్మికుల మృతదేహలకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వారి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతులను కూడా గుర్తించారు.
మార్చి 24న సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన ఈ fire accident ఘటనలో సజీవ దహనమైన 11 మంది bihar వలస కార్మికులు dead bodyలను నిన్ననే గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అక్కడి మార్చురీలో భద్రపరిచారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక అంబులెన్స్ లో మృతదేహాలను తరలించారు. అక్కడినుంచి రెండు special flightsల్లో పట్నా తీసుకెళ్లారు. పట్నా చేరుకున్న అనంతరం కతిహార్, చాప్రా జిల్లాల్లోని వారి స్వస్థలాలకు మృతదేహాలను తరలించారు.
మార్చి 23, బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జనావాసాల మధ్య ఉన్న ఈ గోడౌన్ కు ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తోంది. ఈ విషయం మీద స్తానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.