మంగళగిరి: కాజా టోల్‌ప్లాజా వద్ద లారీలో అగ్నిప్రమాదం... కాలి బూడిదైన క్యాష్ కౌంటర్లు

Siva Kodati |  
Published : Jun 10, 2021, 07:52 PM ISTUpdated : Jun 10, 2021, 08:38 PM IST
మంగళగిరి: కాజా టోల్‌ప్లాజా వద్ద లారీలో అగ్నిప్రమాదం... కాలి బూడిదైన క్యాష్ కౌంటర్లు

సారాంశం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్ ప్లాజా వద్ద గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న లారీ పూర్తిగా దగ్దం అయింది. లారీ తమిళనాడుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. 

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్ ప్లాజా వద్ద గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న లారీ పూర్తిగా దగ్దం అయింది. లారీ తమిళనాడుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ చెల్లింపు సమయంలో లారీ టైర్ ఒక్కసారిగా పేలటంతో మంటలు చెలరేగాయి. టైర్ సమీపంలోని ఆయిల్ ట్యాంక్‌కు మంటలు వ్యాపించడంతో కూడి, ఎడమ వైపుల ఉన్న క్యాష్ కౌంటర్లు మంటలకు కాలి బూడిదయ్యాయి. లాక్ డౌన్ సమయం కావటంతో పెను ప్రమాదం జరగలేదని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని లారీలో ఎలాంటి సరకు లేదని పోలీసులు తెలిపారు. లారీ టైరు పేలటమే ప్రమాదానికి కారణంగా అధికారులు అంచనా వేశారు. 

"

PREV
click me!

Recommended Stories

3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపైUnion Minister Chandra Sekhar Pemmasani Speech | Asianet News Telugu
3వ ప్రపంచ తెలుగు మహాసభలు | Ayyannapatrudu Chintakayala Powerful Speech | Asianet News Telugu