క్లైమ్యాక్స్ కు చేరుకున్న ‘హోదా’ ఫైట్

First Published Apr 6, 2018, 7:31 AM IST
Highlights
సమావేశాలు వాయిదాపడగానే వైసిపి ఎంపిలు ఢిల్లీలోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ కు తమ రాజీనామాలు ఇవ్వనున్నారు.

ప్రత్యేకహోదా ఫైటింగ్ రాష్ట్రంలో క్లైమ్యాక్ కు చేరుకుంది.  శుక్రవారం పార్లమెంటు సమావేశాలు వాయిదా పడగానే ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి ఎంపిలు ఢిల్లీ, రాష్ట్రంలో తమ స్ధాయిలో నిరసనలు మొదలుపెట్టనున్నాయి. వీటికి జనసేన, వాయపక్షాలతో పాటు ప్రత్యేకహోదా సాధన సమితి కూడా రోడ్డక్కనున్నాయి.

సమావేశాలు వాయిదాపడగానే వైసిపి ఎంపిలు ఢిల్లీలోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ కు తమ రాజీనామాలు ఇవ్వనున్నారు. తర్వాత సీన్ ఏపి భవన్ కు మారుతుంది. అక్కడే ఆమరణ నిరాహారదీక్షకు కూర్చోనున్నారు. వారికి సంఘీభావంగా పార్టీ నేతలు, శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మొదలుపెడతారు.

అదే విధంగా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో టిడిపి కూడా ఆందోళనలకు దిగనున్నది. వైసిపి చేసే ఆందోళనలకు పోటీగా టిడిపి కూడా నిరసనలు చేస్తున్నది. ఇదంతా క్రెడిగ్ గేమ్ లాగే ఉంది. అంటే ప్రత్యేకహోదా కోసం చేసే పోరాటంలో మొత్తం క్రెడిగ్ అంతా వైసిపికి మాత్రమే వెళ్ళిపోతుందన్న ఆందోళనే చంద్రబాబులో కనిపిస్తోంది.

తన నివాసం నుండి చంద్రబాబు అసెంబ్లీకి సైకిల్ పై వెళ్ళనున్నారు. అదే విధంగా మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు కూడా సైకిళ్ళు తొక్కి నిరసనలు తెలుపుతారు. అదే సమయంలో పవన్ కల్యాణ్, వామపక్షాల నేతలు కూడా విజయవాడ వీధుల్లో పాదయాత్ర చేయనున్నారు.

 

 

click me!