గుంటూరు విట్ యూనివర్సిటీలో విద్యార్థుల ఘర్షణ.. వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన..

Published : Jun 23, 2023, 02:43 PM IST
గుంటూరు విట్ యూనివర్సిటీలో విద్యార్థుల ఘర్షణ.. వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన..

సారాంశం

గుంటూరు జిల్లాలోని వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) యూనివర్సిటీ విద్యార్థులు ఘర్షణకు దిగారు.యూనివర్సిటీ  ప్రాంగణంలోనే సీనియర్‌లు, జూనియర్‌లు విడిపోయి కొట్టుకున్నారు.

గుంటూరు జిల్లాలోని వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) యూనివర్సిటీ విద్యార్థులు ఘర్షణకు దిగారు.యూనివర్సిటీ  ప్రాంగణంలోనే సీనియర్‌లు, జూనియర్‌లు విడిపోయి కొట్టుకున్నారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణను ఆపేందుకు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, మరికొందరు విద్యార్థులు యత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అయితే హాస్టల్ గదుల కేటాయింపు గురించి సీనియర్లు, జూనియర్ల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగినట్టుగా చెబుతున్నారు. అయితే  ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో.. వారు ఘర్షణకు దిగిన విద్యార్థులను పిలిపించి మాట్లాడారు. అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ణ్యా కేసు నమోదు  చేయకుండా.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేసినట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్