
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. రాష్ట్రంలోని 352 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లో పనిచేస్తున్న 840 మంది పార్ట్‌టైం, గెస్ట్ టీచర్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో తమను విధుల్లోకి తీసుకుని సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. విద్యార్హతలు, తమ సామర్ధ్యం పరీక్షాంచాకే తమను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని వారు తెలిపారు. ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చి తమను రోడ్డున పడేశారని టీచర్లు వాపోతున్నారు.
కేజీబీవీల్లోని ఇంటర్మీడియట్ బోధనకు గతంలో నియమితులైన తెలుగు, ఆంగ్ల ఉపాధ్యాయులను పోస్టుల సర్దుబాటు పేరుతో ప్రభుత్వం ఇంటికి పంపించింది. ఈ క్రమంలో కాంట్రాక్ట్ పద్ధతిలో 1,543 నియామకాలకు గత నెలలో సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.