భావోద్వేగాలను అడ్డుకొంటే మూల్యం తప్పదు: బాబు హెచ్చరిక

First Published Aug 3, 2018, 11:33 AM IST
Highlights

భావోద్వేగాలను అడ్డకొంటే మూల్యం చెల్లించకతప్పదని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  అభిప్రాయపడ్డారు. బీజేపీ ఒంటెత్తు పోకడలను  పార్లమెంట్ వేదికగా  ఎండగట్టాలని ఆయన ఎంపీలకు సూచించారు.

అమరావతి:భావోద్వేగాలను అడ్డకొంటే మూల్యం చెల్లించకతప్పదని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  అభిప్రాయపడ్డారు. బీజేపీ ఒంటెత్తు పోకడలను  పార్లమెంట్ వేదికగా  ఎండగట్టాలని ఆయన ఎంపీలకు సూచించారు.

శుక్రవారం నాడు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాటం చేయాలని  ఆయన ఎంపీలకు సూచించారు. చట్ట ప్రకారంగా  ఏపీకి దక్కాల్సిన వాటి కోసం పోరాటం చేయాలని ఆయన ఎంపీలకు సూచించారు. చట్టప్రకారం హక్కుల్ని  రాబట్టేలా చూడాలన్నారు. 

పార్లమెంట్‌లో ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.  ప్రజలు ఏం కోరుకొంటున్నారనే విషయమై  ఎంపీలు పార్లమెంట్‌లో ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేలా చేయాలని ఆయన సూచించారు.  మెజార్టీ కంటే మోరాల్టీ ముఖ్యమనే విషయాన్ని బీజేపీ గుర్తించేలా చేయాలని ఆయన ఎంపీలకు సూచించారు.

బీజేపీ ఒంటెత్తు పోకడలను  పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఆయన సూచించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కూడ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో బీజేపీ తీరు పట్ల విబేధించిన విషయాన్ని బాబు పార్టీ ఎంపీల దృష్టికి తీసుకొచ్చారు. టీఎంసీ లాంటి  భావసారూప్యత గల పార్టీలతో  కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల్లో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని చంద్రబాబునాయుడు  ఎంపీల దృష్టికి తెచ్చారు.  అసోం, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. భావోద్వేగాలను అడ్డుకొంటే  తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు తప్పవని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. 

click me!