ఇద్దరు పిల్లలను కెనాల్‌లో తోసేసిన కన్న తండ్రి.. తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన..

Published : Sep 20, 2022, 03:35 PM IST
ఇద్దరు పిల్లలను కెనాల్‌లో తోసేసిన కన్న తండ్రి.. తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన..

సారాంశం

గుంటూరు జిల్లా పెదకాకానిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను కన్న తండ్రే కెనాల్‌లో తోసేశాడు. పిల్లలు కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

గుంటూరు జిల్లా పెదకాకానిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను కన్న తండ్రే కెనాల్‌లో తోసేశాడు. పిల్లలు కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పెదకాకానిలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు ‌ తన కొడుకు, కూతురిని తాడేపల్లి పరిధిలోని కుంచనపల్లి వద్ద ఉన్న డెల్టా కాల్వలో తోసేశాడు. ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సోమవారం సాయంత్రం నుంచి పిల్లలు కనిపించకపోవడంతో వెంకటేశ్వరరావు భార్య పోలీసులను ఆశ్రయించింది. 

తన పిల్లలు కనిపించడం లేదంటూ పెదకాకాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పిల్లల తండ్రిని విచారించగా అసలు విషయం తెలిసింది. అతడిని పిల్లలను పడేసిన చోటుకు తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే వెంకటేశ్వరరావు ఈ దారుణానికి ఓడిగట్టునట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్