ప్రేమ వివాహం: నంద్యాలలో కూతురిపై కత్తితో దాడి, నవ వధువు పరిస్థితి విషమం

Published : Sep 12, 2021, 02:30 PM IST
ప్రేమ వివాహం: నంద్యాలలో కూతురిపై కత్తితో దాడి, నవ వధువు పరిస్థితి విషమం

సారాంశం

కర్నూల్ జిల్లా నంద్యాలలో ఆదివారం నాడు దారుణం చోటు చేసుకొంది. ప్రేమ పెళ్లి చేసుకొందని  కూతురిని కత్తితో  పొడిచాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆమెను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  


నంద్యాల:కర్నూల్ జిల్లా నంద్యాలలో కూతురు ప్రేమ వివాహం చేసుకొందని నవ వధువుపై తండ్రి కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో నవవధువు తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నంద్యాలకు చెందిన మళ్లీశ్వరీ తల్లిదండ్రులను ఎదురించి ఇవాళ ప్రేమ వివాహం చేసుకొంది.

ఈ విషయాన్ని తెలుసుకొన్న తండ్రి కోపంతో ఊగిపోయాడు. నవవధువు మల్లీశ్వరీని కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది