దారుణం : కన్నకూతురికి మద్యం తాగించి, లైంగిక దాడి.. ప్రియురాలితో వీడియో తీయించి... !!

Published : Oct 04, 2021, 07:47 AM IST
దారుణం : కన్నకూతురికి మద్యం తాగించి, లైంగిక దాడి.. ప్రియురాలితో వీడియో తీయించి... !!

సారాంశం

ఆ ఉద్యోగి తన 15యేళ్ల కుతురును గత నెల 25న తను ఉద్యోగం చేస్తున్న ఊరికి తీసుకువెళ్లాడు. అక్కడ తన ప్రియురాలితో కలిసి మద్యం తాగి, కుమార్తెకు కూడా బలవంతంగా మద్యాన్ని తాగించాడు. ఆ పై కుమార్తె మీద లైంగిక దాడి చేస్తూ ప్రియురాలితో సెల్ ఫోన్ లో వీడియో తీయించాడు. 

మార్కాపురం : రోజురోజుకూ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. రక్తం రుచి మరిగిన పులుల్లా మారిపోతున్నారు. కన్నకూతురు, తోడ బుట్టిన చెల్లీ వారి కంటికి కేవలం శృంగారవస్తువుల్లాగే కనబడుతున్నారు. మైనర్ కూతుర్లమీద తండ్రుల అఘాయిత్యాలు, అత్యాచారాల ఘటనలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. పిల్లలకు ప్రపంచంలో అత్యంత భద్రత ఉండేది తల్లిదండ్రుల దగ్గర మాత్రమే. కానీ ఆ తండ్రి ఒడే ఆ చిన్నారుల పాలిట యమకూపాలుగా మారుతున్నాయి. అలాంటి దారుణమైన, ఒళ్లు జలదరించే ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. 

కన్న కుమార్తెపైనే లైంగిక దాడికి( Molestation)పాల్పడ్డాడో తండ్రి. పైగా బలవంతంగా కుమార్తెతో మద్యం(Liquor) తాగించి.. లైంగిక దాడి వ్యవహారాన్ని తన ప్రియురాలితో వీడియో(Video) తీయించాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన వెఎస్సార్ (YSR District)జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. 

సర్కిల్ కార్యాలయంలో ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వోద్యోగి.. వైఎస్సార్ జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కాగా, ఇతను బెస్తవారిపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

ఒక్క తప్పుకే ప్రతిపక్షంలో పడ్డాం.. మళ్లీ జరగనివ్వం: రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా ఆ ఉద్యోగి తన 15యేళ్ల కుతురును గత నెల 25న తను ఉద్యోగం చేస్తున్న ఊరికి తీసుకువెళ్లాడు. అక్కడ తన ప్రియురాలితో కలిసి మద్యం తాగి, కుమార్తెకు కూడా బలవంతంగా మద్యాన్ని తాగించాడు. ఆ పై కుమార్తె మీద లైంగిక దాడి చేస్తూ ప్రియురాలితో సెల్ ఫోన్ లో వీడియో తీయించాడు. ఈ ఘటన గురించి బాధిత బాలిక ఇంటికొచ్చాక తన తల్లితో చెప్పింది. 

అదే రోజు పట్టణ పోలీస్ స్టేషన్ లో తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిమీద పోక్సో చట్లం కింది కేసు నమోదు చేశారు. ఈ నెల 2వ తేదీ సాంయత్రం 6.30 గంటల సమయంలో పట్టణ శివారులోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నాగరాజు చెప్పారు. నిందితుడి వద్ద ఉన్న సెల్ ఫోన్, అందులోని వీడియో, ఫోటోలను సీజ్ చేసినట్టు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Attends Swachha Andhra Swarna Andhra Program in Nagari | Asianet News Telugu
నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu