ఒక్క తప్పుకే ప్రతిపక్షంలో పడ్డాం.. మళ్లీ జరగనివ్వం: రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Oct 03, 2021, 08:20 PM IST
ఒక్క తప్పుకే ప్రతిపక్షంలో పడ్డాం.. మళ్లీ జరగనివ్వం: రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వైసీపీ చేసిన త‌ప్పుడు ప్రచారాల‌ను తిప్పికొట్టడంలో వెనుక‌ప‌డ్డామన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ రావు. అందుకే ఇవాళ ఇలా ప్రతిప‌క్షంలో ఉన్నామని అభిప్రాయపడ్డారు. ఆ త‌ప్పు మ‌రోసారి పున‌రావృతం కాకూడదన్నారు. 

వైసీపీ చేసిన త‌ప్పుడు ప్రచారాల‌ను తిప్పికొట్టడంలో వెనుక‌ప‌డ్డామన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ రావు. అందుకే ఇవాళ ఇలా ప్రతిప‌క్షంలో ఉన్నామని అభిప్రాయపడ్డారు. ఆ త‌ప్పు మ‌రోసారి పున‌రావృతం కాకూడదన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ స్థాయి పార్టీ శిక్షణా త‌ర‌గ‌తుల ముగింపు కార్యక్రమంలో కొల్లు రవీంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. మూడేళ్ల వైసీపీ పాలన చూశామని.. ఎంత క‌క్షపూరితంగా, దుర్మార్గంగా, మోస‌పూరితంగా పాలన సాగిస్తోందో అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. 

ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్ళి, వారికి అవ‌గాహన క‌ల్పించాలని త‌ద్వారా భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2024లో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సుశిక్షుతులై శ్రమించాలని... ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోయిన సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లేందుకు భయపడుతున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేక నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడే పార్టీ తెలుగుదేశం కాదని... ఎదురు నిలిచి పోరాడే పార్టీ అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu
Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu