శ్రీకాళహస్తిలో అమానుషం... కన్నబిడ్డను కౄరంగా కొట్టిచంపిన కసాయితండ్రి

Published : Nov 27, 2022, 08:51 AM ISTUpdated : Nov 27, 2022, 08:54 AM IST
శ్రీకాళహస్తిలో అమానుషం... కన్నబిడ్డను కౄరంగా కొట్టిచంపిన కసాయితండ్రి

సారాంశం

కన్న బిడ్డపై ప్రేమను మరిచి, పసిబిడ్డ అన్న జాలి కూడా లేకుండా ఓ కసాయి తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. విచక్షణ కోల్పోయిన తండ్రి బిడ్డను అత్యంత కౄరంగా కొట్టిచంపాడు. 

శ్రీకాళహస్తి : భార్యపై కోపం ఆ తండ్రిని కసాయివాన్ని చేసింది. కన్న తండ్రే ప్రేమానురాగాలు మరిచి ముక్కుపచ్చలారని చిన్నారిని అతి కిరాతకంగా కొట్టిచంపాడు. ఈ అమానుష ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.

శ్రీకాళహస్తి పట్టణంలోని శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని వాటర్ హౌస్ కాలనీలో దంపతులు మునిరాజ, స్వాతి దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు నెలల క్రితం మగబిడ్డ జన్మించాడు. అయితే ఇటీవల చిన్నారి అనారోగ్యానికి గురవడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు చేర్చారు. తాపీ పని చేసే మునిరాజా హాస్పిటల్ ఖర్చులకోసం డబ్బులు లేకపోవడంతో తన బైక్ అమ్ముకున్నాడు. ఈ డబ్బులు హాస్పిటల్లో కట్టి కొడుకుకు వైద్యం చేయించాడు. 

మెరుగైన వైద్యం అందడంతో చిన్నారి ఆరోగ్యంగా బయటకువచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన రెండు రోజుల్లోనే చిన్నారి మళ్లీ అనారోగ్యం బారినపడింది. దీంతో బిడ్డకు సరయిన వైద్యం అందించలేకపోవడం వల్లే మళ్లీ అనారోగ్యానికి గురయ్యిందంటూ స్వాతి భర్తను నిందించింది. ఈ విషయంలో భార్యాభర్తల మద్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. భార్య మాటలతో సహనం కోల్పోయిన మునిరాజు దారుణానికి ఒడిగట్టాడు. 

Read more భార్యతో కలిసున్న బెడ్రూం వీడియోలు లీక్... అడ్డంగా బుక్కయిన నిత్యపెళ్లికొడుకు

ఓవైపు భార్య సూటిపోటి మాటలు, మరోవైపు అనారోగ్యంతో బిడ్డ ఏడుపుతో సహనం కోల్పోయిన మునిరాజు విచక్షణ కోల్పోయాడు. దీంతో కన్నబిడ్డపై ప్రేమను మరిచి పసివాడి కాళ్లు పట్టుకుని అమాంతం పైకెత్తి గోడకేసి కొట్టాడు. దీంతో ఆ పసివాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

 ఈ అమానుష ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాలుడి తండ్రి మునిరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?
Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu