భార్యతో కలిసున్న బెడ్రూం వీడియోలు లీక్... అడ్డంగా బుక్కయిన నిత్యపెళ్లికొడుకు

Published : Nov 27, 2022, 07:47 AM ISTUpdated : Nov 27, 2022, 07:55 AM IST
భార్యతో కలిసున్న బెడ్రూం వీడియోలు లీక్... అడ్డంగా బుక్కయిన నిత్యపెళ్లికొడుకు

సారాంశం

భార్యతో ఏకాంతంగా వున్న వీడియోలను స్నేహితులకు షేర్ చేసి అడ్డంగా బుక్కయాడో నిత్య పెళ్లికొడుకు. నలుగురు భార్యలతో రహస్యంగా కాపురం చేస్తున్న గుట్టు భార్య వీడియోల షేరింగ్ తో రట్టయ్యింది. 

పాడేరు : భార్యతో సన్నిహితంగా వున్న ఫోటోలు స్నేహితులతో పంచుకుని అడ్డంగా బుక్కయ్యాడో నిత్యపెళ్లికొడుకు. తమ బెడ్రూం వీడియోలు, ఫోటోలను చిత్రీకరించడమే కాదు వాటిని ఇతరులకు పంపి నీచానికి పాల్పడ్డ భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు భర్తను పోలీసులు అదుపులోకి తీసుకోగా షాకింగ్ నిజం భయటపడింది. అతడు ఒకరికి తెలియకుండా ఒకరితో మొత్తం నలుగురు మహిళలను పెళ్లాడి రహస్యంగా కాపురం చేస్తున్న నిజం పోలీసుల విచారణలో భయటపడింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగుచూసింది. 

పోలీసులు, బాధిత మహిళలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం చెలిమరవలస గ్రామానికి చెందిన దామోదర్ (37) పాడేరులో నివాసముంటున్నాడు. ఇతడు ఒకరికి తెలియకుండా మరొకరితో మొత్తం నాలుగు పెళ్లిల్లు చేసుకున్నాడు. నలుగురు భార్యలను వేరువేరు చోట్ల వుంచి కాపురం చేసేవాడు. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా మేనేజ్ చేసేవాడు. అతడి మాయలో వున్న భార్యలు కూడా భర్త తమకే సొంతమని భావించారు.. 

read more  మూడు పెళ్లిళ్లు.. బీమా డబ్బు కోసం.. రెండో భార్యను ఆత్మహత్య చేసుకోమంటూ భర్త వేధింపులు..

అయితే ఇటీవల దామోదర్ నాలుగో భార్యతో బెడ్రూంలో సన్నిహితంగా వుండగా సెల్ ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీసుకున్నాడు. వీటిని వాట్సాప్ ద్వారా స్నేహితులకు పంపగా వారు ఇతరులకు పంపించారు. దీంతో ఈ వీడియోలు చుట్టూతిరిగి దామోదర్ భార్యవరకు చేరాయి. భర్త చేసిన నీచపుపని గురించి తెలిసి భరించలేకపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు దామోదర్ ను అదుపులోకి తీసుకోగా మరో షాకింగ్ విషయం బయటపడింది. 

దామోదర్ కు ఇప్పటికే నాలుగు పెళ్లల్లు అయ్యాయని... నలుగురు భార్యలతోనూ కాపురం చేస్తున్నట్లు భయటపడింది. దీంతో ఈ నిత్యపెళ్ళికొడుకుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళలను మోసం చేయడమే కాదు కట్టుకున్న భార్య వీడియోలను ఇతరులతో పంచుకున్న దామోదర్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?