వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల టెండర్లపై తప్పుడు ప్రచారం:టీడీపీపై మంత్రి పెద్దిరెడ్డి పైర్

By narsimha lode  |  First Published Oct 25, 2022, 4:39 PM IST


వ్యవసాయ  మోటార్లకు మీటర్ల  బిగింపుపై రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ, ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి చెప్పారు.


అమరావతి:వ్యవసాయ  మోటార్లకు మీటర్ల బిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ,ఎల్లో మీడియా తప్పుడు  ప్రచారం  చేస్తుందని  ఏపీ విద్యుత్  శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్   శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మంగళవారంనాడు  అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు  వ్యవసాయ మోటార్లకు మీటర్లు  బిగిస్తున్నట్టుగా  మంత్రి చెప్పారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల డిస్కంలలో కూడ  జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. 

Latest Videos

undefined

రైతులు  వాడిన విద్యుత్  కు  ప్రభుత్వమే  డబ్బులు చెల్లిస్తుందని ఆయన స్పష్టం  చేశారు. రైతు నాయకుల ముసుగులో టీడీపీ నేతలు తమ  ప్రభుత్వంపై త ప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు..స్మార్ట్ మీటర్ల  వినియోగంతో  విద్యుత్ ఆదా  కానుందన్నారు.ప్రత్యక్ష  నగదు బదిలీపథకం ద్వారా రైతుల  బ్యాంకు  ఖాతాల్లో నగదును జమ  చేస్తామని మంత్రి వివరించారు. శ్రీకాకుళం   జిల్లాలో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా  ఈ  పథకం  విజయవంతంగా అమలు చేస్తున్నామని  మంత్రి వివరించారు.

వ్యవసాయ  మోటార్లకు మోటార్ల బిగింపుపై  ఓ  పత్రిక తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుందని  ఆయన మండిపడ్డారు. వైసీపీ,సీఎం  జగన్ ను లక్ష్యంగా  చేసుకొని  ఆ   పత్రిక దుష్ప్రచారం చేస్తుందన్నారు.రైతుల  అనుమతితోనే  వ్యవసాయ మోటార్లకు  మీటర్లు బిగిస్తున్నట్టుగా  మంత్రి  చెప్పారు.స్మార్ట్ మీటర్ల టెండర్ల  విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని  మంత్రి  మండిపడ్డారు.ఎల్లో  మీడియాతో  పాటు టీడీపీ  నేతలు ఈ  విషయమై  ప్రజల్లో గందరగోళం సృష్టించే  ప్రయత్నం చేస్తున్నారని  మంత్రి  మండిపడ్డారు.

రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకుస్మార్ట్ మీటర్లను బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం  తీసుకుంది. శ్రీకాకుళం  జిల్లాలో పైలెట్  ప్రాజెక్టు విజయవంతం కావడంతో  రాష్ట్రంలోని అన్ని  వ్యవసాయ పంపుసెట్లకు  స్మార్ట్  మీటర్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం వల్ల విద్యుత్  ఆదా అయిందని అధికారులు గుర్తించారు. అంతేకాదు నాణ్యమైన విద్యత్  ను కూడ అందించేందుకు దోహదపడిందని అధికారులు వివరిస్తున్నారు.
 

click me!