రాజమహేంద్రవరంలో ఇద్దరు కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య.. ఆ ఇబ్బందులే కారణమా..?

Published : Sep 19, 2022, 03:41 PM IST
రాజమహేంద్రవరంలో ఇద్దరు కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య.. ఆ ఇబ్బందులే కారణమా..?

సారాంశం

రాజమండ్రిలోని వీఎల్ పురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత కూతుళ్లను చెరువులోకి తోసేసి.. ఆ తర్వాత అతను కూడా దూకి ప్రాణాలు తీసుకున్నాడు. 

రాజమండ్రిలోని వీఎల్ పురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. సత్యేంద్రకుమార్ రాజమండ్రిలోని వీఎల్ పురం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అతని భార్య స్వాతి, కూతుళ్లు రిషిత, హాద్విక ఉన్నారు. పెద్ద కూతురు రిషిత వయసు 12 ఏళ్లు కాగా, చిన్న కూతురు హాద్విక వయసు 7 ఏళ్లు. అయితే భార్య ఫంక్షన్‌ కోసమని ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే నేడు ఉదయం సత్యేంద్ర కుమార్ తన కూతుళ్లను తీసుకుని రాజవోలు రోడ్డులోని చేపల చెరువు వద్దకు వెళ్లాడు. 

తొలుత కూతుళ్లను చెరువులోకి తోసేశాడు. అనంతరం తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతదేహాలను వెలికి తీసి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి, ఇద్దరు కూతుళ్ల మరణంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇక, సత్యేంద్ర కుమరా్ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు సత్యేంద్రకుమార్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆర్థిక ఇబ్బందులు, విపరీతమైన ఒత్తిడి ఉండటంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సత్యేంద్రకుమార్ ఆ లేఖలో రాసినట్టుగా పోలీసుల చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో ముంబై తరహా కుండపోత వర్షాలే, ఇక అల్లకల్లోలమేనా?
కడప జిల్లా ఏం పాపం చేసుకుందో అర్థం కావడం లేదు 😡 Dr Br Ambedkar Gurukulam Sagileru, Kadapa District