వివేకా హత్య కేసు : సీబీఐ విచారణకు మళ్లీ బ్రేక్...

By AN TeluguFirst Published Feb 5, 2021, 2:16 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు మళ్లీ మొదటికొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణకు మరోసారి బ్రేక్ పడింది. వివేకా హత్య కేసుకు సంబంధించి ముందు కేసు వివరాలు ఇవ్వాలని పులివెందుల కోర్టును సీబీఐ బృందం కోరింది. 

అయితే, కింది స్తాయి అధికారులకు కీలక ఆధారాలు ఇచ్చేందుకు వీలులేదని చెప్పడంతో సీబీఐ అధికారులు వెనుదిరిగారు. కేసు మొత్తం డాక్యుమెంట్ల కోసం విచారణ స్థాయి అధికారి మాత్రమే పిటీషన్ వేయాలని పీపీ స్పష్టం చేసింది. 

గతంలో సిట్ బృందం దాఖలు చేసిన కేసు వివరాల డాక్యుమెంట్ల కోసం సీబీఐ ఇన్స్‌పెక్టర్ అమిత్రాధి నిన్న పులివెందుల కోర్టుకు వచ్చారు. వివేకా హత్య కేసులో సిట్ దాఖలు చేసిన ఆధారాల పత్రాలను అందజేయాలంటూ పులివెందుల కోర్టుకు హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. 

అయితే ఉన్నతాధికారి లేకుండా  కీలక ఆధారాలు ఇవ్వలేమని పులివెందుల కోర్టు చెప్పడంతో సీబీఐ అధికారులు డిల్లీకి తిరుగు పయనమయ్యారు. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14వ తేదీన తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సిట్ విచారిస్తోంది. ఈ హత్య జరిగిన సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.

ఈ హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని  టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. 

click me!