ఈ నెల 9వ తేదీ వరకు ఈ -వాచ్ యాప్ అమల్లోకి తీసుకురావద్దని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది.
ఈ నెల 3వ తేదీన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ యాప్ ను ఆవిష్కరించారు.
అమరావతి: ఈ నెల 9వ తేదీ వరకు ఈ -వాచ్ యాప్ అమల్లోకి తీసుకురావద్దని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది.ఈ నెల 3వ తేదీన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ యాప్ ను ఆవిష్కరించారు.
also read:ఎస్ఈసీ యాప్‌పై లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరణ: రేపు విచారిస్తామన్న హైకోర్టు
ఈ-వాచ్ యాప్ అమలును నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో మూడు పిటిషన్లను దాఖలయ్యాయి. యాప్‌నకు సంబంధించిన భద్రతా ధృవపత్రం అందించలేదని ప్రభుత్వలాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఇంకా ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు లాయర్ చెప్పారు.
also read:ఈ-వాచ్ యాప్‌పై జగన్ సర్కార్ పిటిషన్: విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు
ఈ నెల 9వ తేదీ వరకు ఈ -వాచ్ యాప్ అమల్లోకి తీసుకురావద్దని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది.ఈ నెల 3వ తేదీన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ యాప్ ను ఆవిష్కరించారు. pic.twitter.com/Fvkx2Ngoll
— Asianetnews Telugu (@AsianetNewsTL)ఈ యాప్ పై ఏపీ ప్రభుత్వం కూడ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను ఈ నెల 3వ తేదీన దాఖలు చేసింది. ఈ పిటిషన్ తో పాటు మరో రెండు పిటిషన్లను కూడ దాఖలయ్యాయి.ఈ పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారించింది. ఈ నెల 9వ తేదీ వరకు యాప్ ను అమల్లొకి తీసుకురావొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీ ఎన్నికల సంఘం ఆవిష్కరించిన ఈ యాప్‌నకు పోటీగా వైఎస్ఆర్‌సీపీ ఈ-నేత్రం పేరుతో కొత్త యాప్ ను ఈ నెల 3వ తేదీన ప్రారంభించింది.ఎన్నికల సంఘం ఆవిష్కరించిన యాప్ టీడీపీ కనుసన్నల్లో చేశారని వైఎస్ఆర్‌సీపీ ఆరోపించింది. ఈ విషయమై తమ అభ్యంతరాలను కూడ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రూపంలో అందించింది.