అనుమానాస్పదంగా అకౌంటెంట్ మృతి.. పక్కింటి బావిలో శవంగా తేలి...

Published : Feb 05, 2021, 01:37 PM IST
అనుమానాస్పదంగా అకౌంటెంట్ మృతి.. పక్కింటి బావిలో శవంగా తేలి...

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో అనుమానాస్పద మృతి నమోదయ్యింది. మండలంలోని కొవ్వొలిలో సఖినాల హరినాధబాబు అనే అకౌంటెట్ మృతి చెందాడు. రాత్రి ఇంట్లో నిద్రపోయిన ఆయన తెల్లారేసరికి పక్కింటి బావిలో శవమై తేలడం కలకలం సృష్టిస్తోంది. 

పోలీసులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరినాథబాబు ఏలూరులోని ఉషాబాల సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈ ఉషాబాల గ్రూప్ సంస్థల మీద కొద్ది రోజులుగా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. 

ఐటీ సోదాల నేపథ్యంలో హరినాథబాబు మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. ఈ ఐటీ సోదాలు కొనసాగుతుండగానే మారేళ్ల సత్యనారాయణ అనే మరో అకౌంటెంట్ అదృశ్యమయ్యాడు. దీని మీద రెండు రోజులు క్రితం ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సత్యనారాయణ భార్య ఫిర్యాదు చేసింది. 

ఈ మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంక వీడకముందే మరో అకౌంటెంట్ హరినాధబాబు మృతి.. ఈ కేసులో అనేక  అనుమానాలకు తావిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu