పెథాయ్ ఎఫెక్ట్: పొలంలోనే మృతి చెందిన రైతు

By narsimha lodeFirst Published Dec 18, 2018, 6:26 PM IST
Highlights

పెథాయ్ తుఫాన్ దాటికి పొలంలో వర్షం నీరు చేరడంతో  ఆవేదనతో గొట్టిపల్లి చిన్నవాడు అనే రైతు బుధవారం నాడు మృతి చెందాడు. 
 


శ్రీకాకుళం: పెథాయ్ తుఫాన్ దాటికి పొలంలో వర్షం నీరు చేరడంతో  ఆవేదనతో గొట్టిపల్లి చిన్నవాడు అనే రైతు బుధవారం నాడు మృతి చెందాడు. 

అకాల వర్షానికి పొలంలో నిలిచిన వర్షపు నీటిని  తోడేస్తున్న రైతు ఆవేదనతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  మృతి చెందిన గొట్లిపల్లి చిన్నవాడిది కొసమాల గ్రామం.
పొలంలో చేరిన  వరద నీటిలో కూరుకుపోవడంతో ఆవేదనకు గురైన రైతు కుప్పకూలిపోయాడు. 

స్థానికంగా ఉన్న రైతులు గొట్టిపల్లి చిన్నవాడి వద్దకు చేరుకొని చూడగా అప్పటికే అతను మృతి చెందాడు.పంట పొలంలో చేరిన వరద నీటిని దిగువకు తరలించే  క్రమంలో భాగంగా  గుండెపోటుకు గురైన  ఆయన  మృతి చెందినట్టు స్థానిక రైతులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలోనే తిత్లీ తుఫాన్  రైతాంగాన్ని తీవ్రంగా నష్టపర్చింది. పెథాయ్ తుఫాన్  మరోసారి తీరని నష్టాన్ని మిగిల్చిందనే ఆవేదనతో  అతను మరణించాడని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ప్రధాని అయ్యే ఆలోచన లేదు:చంద్రబాబు

పెథాయ్‌ తుఫాన్: విపక్షాల విమర్శలకు బాబు కౌంటర్

click me!