నేను డ్యాన్స్ కు పనికిరాను అన్నారు.. : శోభానాయుడు

By AN TeluguFirst Published Oct 14, 2020, 10:46 AM IST
Highlights

చెన్నై వెళ్లక ముందు కూడా అనకాపల్లిలో కొంతమంది గురువుల దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు శోభానాయడు. అరంగేట్రం చేయిస్తే డ్యాన్సర్ అయిపోయినట్టే ననేది శోభానాయుడు తండ్రి భావన. మొదట్లో నేర్చుకున్న గురువుతో చెన్నైలో అరంగేట్రానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ గురువు దగ్గరి నుండి ఎలాంటి పిలుపు రాలేదు. రోజులు గడిచిపోయాయి.

ఓ రోజు ఆ గురువుగారు ఇంటికి వస్తే ఉండబట్టలేక తండ్రి అడిగేశాడట.. అరంగేట్రం అన్నారు మేమంతా రెడీగా పెట్టుకున్నాం. మీ దగ్గరి నుండి కబురు లేదు అని. అప్పుడు ఆయన కాస్త ఇబ్బంది పడుతూ నాయుడు గారూ మీరు మనసు కష్ట పెట్టుకోవద్దు అంటూ ఈ అమ్మాయి డ్యాన్స్ కు పనికిరాదు. అమ్మాయి ఫీచర్స్ కానీ, అభినయం కానీ ఆమె నడకలోనే నాట్యం లేదు అని చెప్పారు. ఇది విన్న శోభానాయుడు నాన్నగారు చాలా బాధ పడ్డారు. 

తలుపు చాటునుండి ఇదంతా వింటున్న శోభా నాయుడు కూడా చాలా బాధపడ్డారట. అప్పటి వరకు ఆమెకు చదువంటే చాలా ఇష్టం. ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవారట. అందుకే నృత్యం కోసం చెన్నై వెళ్లాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారట. ఆయనలా అనడం విన్నాక చెన్నై వెళ్లాలని డిసైడ్ అయ్యారట.

ఆయన అన్నది నిజం కాదు అని నిరూపించాలనుకున్నారట. అదే చివరికి జరిగింది. మొదట్లో కృష్ణపరిజాతంలో కృష్ణుడి వేషం వేస్తే అమ్మాయిలా ఉందని విమర్శించారట, ముద్రలు పట్టడం లేదని ఎన్నో రకాలుగా విమర్శలు వచ్చాయట.

వెంపటి గారు చాలా ఫర్ ఫెక్షనిస్ట్ అందుకే మేము ఇలా తయారయ్యామేమో అని చెప్పుకొచ్చారామె. నేర్పించే సమయంలో ఎంతో తిట్టేవారట. చాలాసార్లు ఎందుకు ఇక్కడున్నామా అనుకున్న సందర్బాలున్నాయట.  కొన్ని సార్లైతే అందరి మధ్య నీకు డ్యాన్స్ రాదు ఏం రాదు.. ఇక్కడ్నుండి వెళ్లిపో అనేవారట. వాటన్నింటిని తట్టుకున్నారు కాబట్టే కూచిపూడికి ఐకాన్ గా మిగిలారు. 

click me!