మా అమ్మ పెట్టిన భిక్షే.. ఈ పేరు, హోదా.. అంతా... : శోభానాయుడు

By AN TeluguFirst Published Oct 14, 2020, 10:02 AM IST
Highlights

ఊయలలో ఉన్నప్పుడూ నాట్యం చేయడం మొదలు పెట్టిన అద్భుత నృత్యకారిణి శోభానాయుడు. తనలోని నృత్యకారిణిని మొదట గుర్తించింది తన తల్లే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. 

ఊయలలో ఉన్నప్పుడూ నాట్యం చేయడం మొదలు పెట్టిన అద్భుత నృత్యకారిణి శోభానాయుడు. తనలోని నృత్యకారిణిని మొదట గుర్తించింది తన తల్లే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. 

చిన్నతనంలో  ఉయ్యాలలో ఉన్నప్పుడే కాళ్లూ, చేతులు లయబద్ధంగా కదిలించేవారట.. అది చూసిన తల్లి సరోజినీ దేవి శోభానాయుడికి నృత్యం నేర్పించాలనుకున్నారు. దీనికోసం కుటుంబంతో పెద్ద యుద్ధమే చేశారామె. 

నాలుగో యేటే డ్యాన్స్ క్లాసులో చేర్చించారు శోభానాయుడిని, ఐదో యేట తొలి ప్రదర్శన ఇచ్చారు. అప్పుడప్పుడే కూచిపూడి పేరు వినిపిస్తుంది. కూతుర్ని ఎలాగైనా మంచి నృత్యకారిణిని చేయాలని ఆలోచించిన తల్లి సరోజినీ దేవి కూచిపూడిలో శిక్షణ కోసం చెన్నై తీసుకువెళ్లాలనుకున్నారు. 

ఆడవాళ్లు వంటింట్లో నుండి హాల్ లోకి రావడమే తప్పు అని భావించే కుటుంబంలో పుట్టారామె. అలాంటింది నృత్యం కోసం అనకాపల్లి నుండి చెన్నై వెళ్లడం పెద్ద సాహసమే. అయినా ఎదురించారు. డ్యాన్స్ అంటూ చెన్నై తీసుకుపోతున్నారు. తర్వాత సినిమాల్లో చేరుస్తారా అంటూ ఎన్నో విమర్శలు చేశారు. అయినా తల్లి వెనక్కి తగ్గలేదు. తన కూతురికి ఉన్న టాలెంట్ ను సపోర్ట్ చేయాలనుకుంది. 

పదకొండేళ్లు చెన్నైలో కూతుర్ని పెట్టుకుని డ్యాన్స్ నేర్పిస్తూ అష్టకష్టాలూ పడ్డారు. ఆ తరువాత చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చారు. అంతా డ్యాన్స్ కోసమే. అందుకే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం మాట్లాడుతూ శోభానాయుడు మా అమ్మ లేకపోతే నేను లేను, పద్మశ్రీ శోభానాయుడు లేదు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

click me!