వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఎందుకు సిబిఐకి అప్పగించడం లేదని ఆయన కూతురు సునీత ప్రశ్నించారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిక్కులను ఎదుర్కునే అవకాశం ఉంది. రాజకీయంగా ఆయనకు చిక్కులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. సోదరి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆయనకు కష్టాలను తెచ్చి పెట్టే విధంగానే ఉంది.
శాసనసభ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి తన నివాసంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. తన తండ్రి మరణం విషయంలో ఆమె పలువురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రి మరణంపై సిట్ చేస్తున్న దర్యాప్తును ఆమె తప్పు పట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కేసును సిబిఐకి ఎందుకు అప్పగించడం లేదని ఆమె ప్రశ్నించారు.
undefined
Also Read: వైఎస్ వివేకా హత్య కేసు: పేర్లు వెల్లడించిన కూతురు సునీత. జాబితా ఇదే
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు బిటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సునీత కూడా అదే విచారణను డిమాండ్ చేయడం జగన్ కు ఇబ్బందికరంగానే మారింది.
తనకు అనుమానం ఉన్న వ్యక్తుల జాబితాను కూడా సునీత కోర్టుకు సమర్పించారు. ఈ జాబితాలో వైసీపీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి పేరు, ఆయన తండ్రి పేరు కూడా ఉండడం కూడా జగన్ ను ఇబ్బందుల్లో పెట్టే విషయమే.
Also Read: వివేకా హత్య కేసులో ట్విస్ట్... మరో పిటిషన్ వేసిన కుమార్తె సునీత
వైఎస్ వివేకా హత్యను సిబిఐకి అప్పగించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ కేసును సిబిఐకి అప్పగించడానికి ఇప్పుడు ఆయన ఇష్టడడం లేదు.
పైగా, కేసు దర్యాపు కోసం రెండో సిట్ ను ఏర్పాటు చేయడాన్ని కూడా సునీత ప్రశ్నిస్తున్నారు. గతంలో కేసు విచారణకు నేతృత్వం వహించిన సీనియర్ పోలీసు అధికారి అభిషేక్ మహంతి దీర్షకాలిక సెలవులో వెళ్లారు.