విద్యార్థులను నిర్బంధించలేం: ఇంగ్లీష్ మీడియంపై జగన్‌కు హైకోర్టు షాక్

By Siva KodatiFirst Published Jan 28, 2020, 8:50 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంగ్లీష్ మీడియం విధానంపై హైకోర్టులో షాక్ తగిలింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేయాలని తీసుకున్న నిర్ణయంపై ఉన్నత న్యాయస్థానం చురకలంటించింది

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంగ్లీష్ మీడియం విధానంపై హైకోర్టులో షాక్ తగిలింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేయాలని తీసుకున్న నిర్ణయంపై ఉన్నత న్యాయస్థానం చురకలంటించింది.

Also Read:వైఎస్ వివేకా హత్య కేసు: పేర్లు వెల్లడించిన కూతురు సునీత. జాబితా ఇదే...

విద్యార్ధులు తమకు నచ్చిన మాధ్యమంలో విద్యాభ్యాసం చేసుకునే హక్కు ఉందని న్యాయస్థానం తెలిపింది. నిర్బంధంగా బోధించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కాగా ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం రూపొందించిన బిల్లు శాసనసభ ఆమోదం పొందగా, మండలి దానికి సవరణలు సూచించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని తొలగించి ఆంగ్ల మాధ్యమంలో బోధించడం సరికాదంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... విద్యార్ధులను ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలని నిర్బంధించలేమని స్పష్టం చేసింది. 

అలాంటి తీర్పు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని.. ఇంగ్లీష్ మీడియం పుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు చేపడితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలాంటి చర్యలకు పాల్పడిన అధికారుల నుంచే ఖర్చులు రాబతామని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది.

Also Read:రాజధాని రైతులకు అండగా నిలుద్దాం: బీజేపీ, జనసేనల నిర్ణయం

దీనిపై విచారణను హైకోర్టు ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. అలాగే అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. లేని పక్షంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

click me!