ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

Published : May 07, 2019, 01:56 PM IST
ఏసీబీ డీజీ  ఏబీ వెంకటేశ్వరరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

సారాంశం

తనకు అత్యంత మెజారిటీ వచ్చే అనపర్తి నియోజకవర్గంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ను తీసుకెళ్లి స్టేషన్లో బంధించారని అది కూడా ఒక కుట్రలో భాగమేనంటూ చెప్పుకొచ్చారు. తాను ఆస్టేషన్ కు వెళ్తే అది డీఐజీ ఆర్డర్ తాము ఏమీ చెయ్యలేమంటూ పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పారని గుర్తు చేశారు. వైఎస్ ఆర్ హయాంలోనే ఎన్నికల కమిషన్ ఇబ్బందులను తాము ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. 

విజయవాడ: ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 2009 ఎన్నికల్లో తమ ప్రాంతానికి డీఐజీగా ఏబీ వెంకటేశ్వరరావును ఎలక్షన్ కమిషన్ నియమించిందని స్పష్టం చేశారు. 

అయితే ఆ ఎన్నికల్లో డీఐజీ ఆదేశాలతో తాము ఉక్కిరిబిక్కిరి అయ్యామని గతాన్ని గుర్తు చేశారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ లో ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీటింగ్ నిర్వహించారని ఆ సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న కార్యకర్తల వాహనాలను సీజ్ చేసి హల్ చల్ చేశారని గుర్తు చేశారు. 

పదుల సంఖ్యలో ద్విచక్రవాహనాల్లో కార్యకర్తలు వస్తుంటే అందులో ముగ్గురు త్రిబుల్ రైడింగ్ చేశారని అందుకు మెుత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాహనాలను సీజ్ చేశారని చెప్పుకొచ్చారు. 

ఈ విషయం వైఎస్ దృష్టికి వెళ్తే ఎన్నికల కమిషన్ నిర్ణయాలను తాము ఏమీ చెయ్యలేమని అయినా సమస్యను ఉండవల్లి అరుణ్ కుమార్ పరిష్కరిస్తారంటూ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 

అలాగే తనకు అత్యంత మెజారిటీ వచ్చే అనపర్తి నియోజకవర్గంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ను తీసుకెళ్లి స్టేషన్లో బంధించారని అది కూడా ఒక కుట్రలో భాగమేనంటూ చెప్పుకొచ్చారు. తాను ఆస్టేషన్ కు వెళ్తే అది డీఐజీ ఆర్డర్ తాము ఏమీ చెయ్యలేమంటూ పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పారని గుర్తు చేశారు. 

వైఎస్ ఆర్ హయాంలోనే ఎన్నికల కమిషన్ ఇబ్బందులను తాము ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. అంతేకానీ ఈసీకి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చెయ్యడం కానీ రాజకీయాలు చెయ్యడం కానీ చెయ్యలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీలో చేరే అంశంపై తేల్చేసిన మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

సీఎం-సీఎస్ గొడవకు కారణమిదే: తేల్చేసిన ఉండవల్లి

సీఎం గారు.. పోలవరంలో తేడా వస్తే రాజమండ్రి మటాషే: ఉండవల్లి

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు