అంధ్ర ప్రదేశ్ లో టిడిపి కూటమి గెలుపుకు 10 రిజన్స్ ఇవే..: ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నదిదే..!!

By Arun Kumar P  |  First Published Jun 3, 2024, 11:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు టిడిపి కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి... ఇందుకు గల కారణాలను కూడా పలు సర్వే సంస్థలు వివరిస్తున్నాయి. ఇలా టిడిపి గెలుపు, వైసిపి ఓటమికి దారీతీసిన టాప్ 10 కారణాలవే....   


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేస్తే... తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలన్నింటిని కలుపుకుపోయి బరిలోకి దిగింది. ఇలా టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడటంతో వైసిపికి భారీ దెబ్బ పడిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం... తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇలాంటి ఫలితాలనే వెల్లడించాయి. ఈసారి టిడిపి కూటమి విజయం ఖాయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.   

టిడిపి కూటమి గెలుపుకు... వైసిపి ఓటమికి గల కారణాలను కూడా ఎగ్జిట్ పోల్స్ విశ్లేషిస్తున్నాయి. టిడిపి, జనసేన, బిజెపి పొత్తు వైసిపి ఓటమికి ప్రధాన కారణం కానుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు జాగ్రత్తపడ్డాయని... ఒకవేళ రేపటి ఫలితాల్లో వైసిపి ఓడితే ఇదే ప్రధాన కారణం అవుతుందట. ఇలా తమ సర్వేలో అధికార పార్టీ ఓటమి, ప్రతిపక్ష కూటమికి గెలుస్తుందని తేలిందని.. అందుకు గల కారణాలను కూడా పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 

Latest Videos

undefined

టిడిపి కూటమి గెలుపు - వైసిపి ఓటమికి కారణాలు (ఎగ్జిట్ పోల్స్ ప్రకారం): 

1. తెలుగుదేశం పార్టీ గత అసెంబ్లీలో చేసిన పొరపాట్లను గుర్తించి ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఓవర్ కాన్పిడెంట్ కు పోకుండా ప్రతిపక్ష జనసేన, బిజెపిలను కలుపుకుపోయింది. ఇలా టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి పోటీచేయడమే వైసిపి ఓటమికి దారితీసిందంటూ పలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. టిడిపి కూటమి సంపూర్ణ మెజారిటీతో గెలుస్తుందని అధిక సర్వేలు చెబుతున్నాయి. 

2. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై చాలా ప్రభావం చూపిందని ఇండియా టుడే  - మై యాక్సిస్ వంటి సంస్థలు చెబుతున్నాయి. తమ సర్వేలో చంద్రబాబుపై సానుభూతితో చాలామంది ఓటేసారని తేలినట్లు ఎగ్జిట్ పోల్ సంస్థలు తెలిపాయి. 

3. జనసేన, బిజెపి ప్రభావం కూడా టిడిపి కూటమిపై చాలా వుందని తేల్చాయి. పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీపై అభిమానం కూటమికి ఓట్లు రాల్చాయని సర్వేలు చెబుతున్నాయి. జనసేన, బిజెపికి ఈసారి మంచి ఓట్లు, సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

4. మూడు రాజధానుల ఎఫెక్ట్ వైసిపికి గట్టిగానే తాకిందనేది మరికొన్ని సర్వే సంస్థల అభిప్రాయం. ఆంధ్ర ప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా వైసిపి మార్చిందంటూ   ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రతిపక్ష కూటమి సక్సెయి అయ్యింది... అందువల్లే ప్రజలు టిడిపి కూటమి వైపు మొగ్గుచూపారని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ. 

5. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కాకుండా కేంద్రంలో అధికారంలో వున్న బిజెపితో, ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు సఖ్యతతో వుండటం చాలా బాగా పనిచేసిందట. పోలింగ్ సమయంలో వైసిపి అరాచకాలకు పాల్పడకుండా ఇది పనిచేసిందట. ఎలక్షన్ కమీషన్, పోలీసులు టిడిపి కూటమికి అనుకూలంగా పనిచేసాయని స్వయంగా వైసిపి నాయకులే ఆరోపిస్తున్నారు. ఇలా వైసిపి రాష్ట్రంలో అధికారంలో వున్నా... పోలింగ్ యంత్రాంగం టిడిపి కూటమికే అనుకూలంగా వ్యవహరించిందట. ఇది కూడా ప్రతిపక్ష కూటమి గెలుపు అవకాశాలను పెంచిందట. 

6. జగన్ సర్కార్ అందించిన సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఇవే తమను కాపాడతాయని వైసిపి భావిస్తోంది. కానీ టిడిపి కూటమిని ఓడించే స్థాయిలో ఈ సంక్షేమ పథకాలు పని చేయడంలేవు అనేది ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మహిళలు వైసిపి వైపే ఎక్కువగా మొగ్గుచూపినా గెలుపు అవకాశాలు తక్కువేనని ఇండియా టుడే సర్వే చెబుతోంది. 

7. వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందట. ఈ విషయాన్ని గుర్తించే వైసిపి అధినేత వైఎస్ జగన్ చాలాచోట్ల సిట్టింగ్ లను మార్చి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. కానీ ఇది ప్రజల్లో వైసిపిపై ఏర్పడిన వ్యతిరేకతను తొలగించలేకపోయిందని కొన్ని సర్వే సంస్థలు అభిప్రాయపడ్డాయి. 

8. ఇక వైఎస్ జగన్ కు ఆయన కుటుంబసభ్యులే వ్యతిరేకిస్తుండటం కూడా ఎన్నికలపై ప్రభావం చూపిందట. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతతో పాటు పోలింగ్ చివరి నిమిషంలో వైఎస్ విజయమ్మ కూడా వైసిపిని వ్యతిరేకించారు. ఇది కూడా వైసిపి ఓటింగ్ ను కొంత తగ్గించిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. 

9. వైసిపిని ముందునుండి హిందూ వ్యతిరేక పార్టీగా ప్రచారంచేస్తూ వచ్చింది టిడిపి. ఇక ఎన్నికల్లో హిందుత్వ పార్టీగా పేరున్న బిజెపితో పొత్తు పెట్టుకుంది. దీంతో హిందువులు టిడిపి కూటమికి... ముస్లిం మైనారిటీలు వైసిపి పక్షాన నిలిచారు. ఇలా హిందువుల పోలరైజేషన్ కూడా కూటమి కూటమి గెలుపుకు దోహదపడిందట.    

10. పవన్ కల్యాణ్ కాపు ఓట్లను టిడిపి వైపు మళ్లించగలిగాడట... ఇక సహజంగానే టిడిపికి కమ్మ సామాజికవర్గం సపోర్ట్ వుంటుంది... ఇలా కుల సమీకరణలు కూడా కుదరడం టిడిపి కూటమికి ప్లస్ అయ్యిందనేది ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ. 
 

click me!