India Today-Axis My India Exit Poll 2024 : బీజేపీ-టీడీపీ-జనసేనల పొత్తు ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు చేసినట్లు కనిపిస్తోంది. బీజేపీ, చంద్రబాబు నాయుడి టీడీపీ, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలతో కూడిన కూటమి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకివ్వనుందని ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంటోంది.
Andhra Pradesh exit poll : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బతగలనుందని తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కూటమి మెజారిటీ స్థానాలను దక్కించుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంటోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడి షాక్ తగలనుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
బీజేపీ-టీడీపీ-జనసేనల పొత్తు ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు చేసినట్లు ఇండియా టూడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీ, చంద్రబాబు నాయుడి టీడీపీ, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేలతో కూడిన కూటమి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకిస్తూ అధికారం దక్కించుకునే విధంగా మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. మొత్తం 175 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల్లో అధిక స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందనీ, ఆ తర్వాతి స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉంటుందని పేర్కొంది.
undefined
అధిక స్థానాలు తెలుగుదేశం పార్టీకే..
చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ 76 నుంచి 96 స్థానాలను గెలుచుకునే అవకాశముందని తెలిపింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ 55 నుంచి 77 స్థానాలు విజయం సాధించవచ్చని పేర్కొంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ 16 నుంచి 18 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది. అలాగే, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో కైవసం చేసుకుంటుందనీ, కాంగ్రెస్ పార్టీ 0-2 స్థానాలు దక్కే అవకాశలను ప్రస్తావించింది.
ఓటింగ్ శాతం పరంగా వైఎస్ఆర్సీపీదే పై చేయి..
సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ముందుండగా, ఓటింగ్ శాతంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పైచేయి సాధిస్తుందని ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంది. వైఎస్ఆర్సీపీకి 44 శాతం ఓట్లు, టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. జనసేనకు 7 శాతం, బీజేపీకి 2 శాతం, కాంగ్రెస్ కు 2 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.
India vs Ireland: టీ20 వరల్డ్ కప్ 2024లో ఐర్లాండ్ తో తొలి పోరుకు సై.. భారత్ రికార్డులు ఇవే