యువకుడితో చనువుగా ఉందని.. కోడలిని చంపిన మామ..!

Published : Jul 31, 2021, 08:01 AM ISTUpdated : Jul 31, 2021, 08:14 AM IST
యువకుడితో చనువుగా ఉందని.. కోడలిని చంపిన మామ..!

సారాంశం

కాగా.. ప్రియమణి.. తన కొడుక్కి అన్యాయం చేసి.. మరో యువకుడితో..  చనువుగా ఉంటోందని సత్యానారాయణ గుర్తించారు.

తన కొడుకు కు తెలియకుండా.. తమ కోడలు మరో యువకుడితో చనువుగా ఉందని ఓ మామ  పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే..  కోడలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో  చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మలికిపురం ప్రాంతానికి చెందిన  చొప్పల సత్యనారాయణ తన కుమారుడు విజయ్ కుమార్ కు ఏడేళ్ల క్రితం.. ప్రియమణి(25) అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. విజయ్ కుమార్ ఉపాధి నిమిత్తం ఖతార్  వెళ్లాడు.

ప్రియమణి కుటుంబసభ్యులు... అండమాన్ లో ఉంటున్నారు. అయితే.. ప్రియమణి మాత్రం.. అత్తామామల తో కలిసి ఇక్కడే ఉంటోంది. కాగా.. ప్రియమణి.. తన కొడుక్కి అన్యాయం చేసి.. మరో యువకుడితో..  చనువుగా ఉంటోందని సత్యానారాయణ గుర్తించారు.

వారం క్రితం అతనితో పరారయ్యింది కూడా. ఆమె అలా లేచిపోయిందని సత్యానారాయణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమెను పట్టుకొని వచ్చి కొద్ది రోజులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా కోడలిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో  రగిలిపోయిన సత్యనారాయణ... కోడలిని చాక్ తో పొడిచి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?