గుప్తనిధులు : స్వామీజీ చెప్పాడని.. ఇంట్లో 20 అడుగుల గొయ్యి....

By SumaBala BukkaFirst Published Dec 18, 2023, 12:33 PM IST
Highlights

రాత్రిపూట కూడా తవ్వకాలు కొనసాగించారు. ఈ శబ్దాలు చుట్టుపక్కల వారికి వినిపించకుండా దేవుడు పాటలు పెట్టుకుని ఏమార్చినట్లుగా  తెలుస్తోంది. 

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఓ రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో ఈ గుప్తనిధుల తవ్వకాలు జరిగినట్లుగా సమాచారం. విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గుప్త నిధుల తవ్వకాల కోసం కోటేశ్వరరావు అని రైల్వే ఉద్యోగి విజయవాడ నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి తవ్వకాలు జరిపినట్లుగా తెలుస్తోంది. రైల్వే క్వార్టర్స్ లో దీనికోసం 20 అడుగుల గొయ్యి తవ్వినట్టుగా తెలుస్తోంది. 

గత నెల రోజులుగా రైల్వే క్వార్టర్స్ లో సదరు వ్యక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. బయటకి పూజల్లా కనిపిస్తూ లోపల తవ్వకాలు చేస్తున్నారని తేలింది.తవ్వకాలు చేపట్టిన చోట చుట్టూ పరదాలు కప్పారు. రాత్రిపూట కూడా తవ్వకాలు కొనసాగించారు. ఈ శబ్దాలు చుట్టుపక్కల వారికి వినిపించకుండా దేవుడు పాటలు పెట్టుకుని ఏమార్చినట్లుగా  తెలుస్తోంది. అయితే, ఈ విషయం ఎలాగో బయటకి పొక్కింది. దీంతో అక్కడ ఉన్న కొందరు మహిళలు పరారయ్యారు. 

YSR Aarogyasri : ఇక సరికొత్త ఆరోగ్యశ్రీ అమలు... స్మాార్ట్ కార్డుల్లోని సరికొత్త ఫీచర్లివే...

మరి కొంతమంది గేట్లకు తాళాలు వేసి పారిపోయారు. దోష నివారణ కోసమే పూజలు చేస్తున్నామని కొంతమంది వ్యక్తులు చెబుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు కోటేశ్వరరావుతో సహా మిగతా వారిని ప్రశ్నించగా.. స్వామీజీ చెప్పినట్లే చేస్తున్నానంటూ కోటేశ్వరరావు తెలిపాడు. కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన ముద్ద నిందితుడైన కోటేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు.

click me!