జైలు బయట తల్లికోసం ఈ చిన్నారి ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుందో చూడండి...

Published : Dec 18, 2023, 10:27 AM ISTUpdated : Dec 18, 2023, 10:29 AM IST
జైలు బయట తల్లికోసం ఈ చిన్నారి ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుందో చూడండి...

సారాంశం

ఆ చిన్నారి తల్లి ఖాదీజా బీ (35) సింగిల్ పేరెంట్. ఆమె ఓ దొంగతనం కేసులో డిసెంబర్ 12న జైలు పాలైంది. భర్త వదిలేయడంతో కుటుంబ పోషణ భారం అయ్యి, చిన్న చిన్న నేరాలకు పాల్పడింది. 

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లో ఓ హృదయవిదారకమైన ఘటన వెలుగు చూసింది. కర్నూలు సబ్ జైలు దగ్గర ఓ చిన్నారి తల్లికోసం ఏడుస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. చూసిన అందరి హృదయాల్నీ కదిలిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో మహిళా సబ్ జైలు బయట 9 ఏళ్ల బాలిక ఏడుస్తుండడాన్ని ఓ బాటసారి గమనించారు. దాన్ని వీడియో తీశాడు. ఆ చిన్నారి తన తల్లిని కలవడానికి అనుమతించమని ఏడుస్తోంది. దాన్ని మొత్తం ఆ వ్యక్తి రికార్డ్ చేశాడు.

ఆయనను సంతృప్తిపర్చేలా చంద్రబాబు, పవన్ చర్చలు..: అంబటి ఎద్దేవా

సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ఆ చిన్నారి తల్లి ఖాదీజా బీ (35) సింగిల్ పేరెంట్. ఆమె ఓ దొంగతనం కేసులో డిసెంబర్ 12న జైలు పాలైంది. భర్త వదిలేయడంతో కుటుంబ పోషణ భారం అయ్యి, చిన్న చిన్న నేరాలకు పాల్పడింది. దీంతో ప్రస్తుతం ఆమెను జైలుకు వెళ్లేలా చేసింది. ఈ విషయాలు తరువాత తెలిసాయి. 

ఖాదీజా బీకి ఐదుగురు పిల్లలు.. వారిలో ఒకరే ఈ తొమ్మిదేళ్ల బాలిక. తల్లిని కలవాలంటూ రోధిస్తుంది. ఈ వీడియో తీసిన తరువాత ఆ వ్యక్తి వెంటనే జైలు సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని, వెంటనే బాలికను తన తల్లితో కలవడానికి జైలులో అన్ని జాగ్రత్తలతో అనుమతించారు.


 

PREV
click me!

Recommended Stories

విజయవాడలో కారు ధరకే 2BHK ప్లాట్స్... భవిష్యత్ లో ఇక్కడ రియల్ బూమ్ ఖాయం
Rain Update:తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సమే! | Weather Update | Asianet News Telugu