పార్టీ మారుతూ అధినేతను ఏదో ఒకటి అంటున్నారు: వంశీపై జేసీ ఫైర్

జగన్ ప్రభుత్వానికి ప్రతీకార వాంఛ ఎక్కువైందన్నారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వ పెద్దల ఒత్తడితోనే అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.


జగన్ ప్రభుత్వానికి ప్రతీకార వాంఛ ఎక్కువైందన్నారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వ పెద్దల ఒత్తడితోనే అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

అధికారం శాశ్వతం కాదని జగన్ తెలుసుకోవాలని... పార్టీ మారేవాళ్లు అధినేతను ఏదో ఒకటి అనాలికదా అంటూ జేసీ చురకలంటించారు. వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదని, పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఎందుకో తనకు తెలియడం లేదన్నారు.

Latest Videos

కొంతకాలం నుంచి బస్సుల వ్యాపారాన్ని మానేయాలని అనుకుంటున్నానని జేసీ తెలిపారు. కేసుల గొడవ కంటే .. వ్యాపారం ఆపేస్తేనే బాగుంటుందని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Also Read:టీడీపీ ఎమ్మెల్సీపై వల్లభనేని వంశీ తిట్లదండకం...అది కూడా లైవ్ లో

గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ  టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. చంద్రబాబుతో పాటు లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలపై వంశీ నుండి  వివరణ కోరనున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని  వంశీ గురువారం సాయంత్రం  టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో వంశీ చేసిన వ్యాఖ్యలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ సీనియర్ల అభిప్రాయాలను చంద్రబాబునాయుడు తెలుసుకొన్నారు.

వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో సీరియస్‌గా చర్చ జరిగింది. వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని  టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.

Aslo Read:బాబుపై తీవ్ర వ్యాఖ్యలు: టీడీపీ నుండి వల్లభనేని వంశీ సస్పెన్షన్

ఈ మేరకు పార్టీ నుండి వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ  ఎమ్మెల్యే రామానాయుడు శుక్రవారం నాడు  మధ్యాహ్నం చంద్రబాబునాయుడుతో సమావేశం ముగిసిన తర్వాత ప్రకటించారు. వల్లభనేని వంశీని సస్పెండ్ చేయడమే కాకుండా  ఆయనను వివరణ కూడ కోరాలని పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై పార్టీ నేతలు వంశీని వివరణ కోరనున్నారు.

వల్లభనేని వంశీ త్వరలోనే వైసీపీలో చేరనున్నారు. వంశీ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా  ఉంటున్నారు. టీడీపీలో వల్లభనేని వంశీ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో కన్పించడం లేదని ఆయన ప్రస్తావించారు. 

click me!