టీడీపీని టచ్ చేసే మగాడు లేడు, రాబోడు: జగన్‌పై అనిత వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 10, 2020, 05:20 PM ISTUpdated : Jan 10, 2020, 05:46 PM IST
టీడీపీని టచ్ చేసే మగాడు లేడు, రాబోడు: జగన్‌పై అనిత వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ కార్యకర్తలను టచ్ చేసే మగాడు ఇప్పటి వరకు లేడని.. కాంట్రవర్సీ చేస్తారో కేసులే పెట్టుకుంటారో పెట్టుకోండంటూ సవాల్ విసిరారు టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే అనిత. 

టీడీపీ కార్యకర్తలను టచ్ చేసే మగాడు ఇప్పటి వరకు లేడని.. కాంట్రవర్సీ చేస్తారో కేసులే పెట్టుకుంటారో పెట్టుకోండంటూ సవాల్ విసిరారు టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే అనిత. ముఖ్యమంత్రి నియమించింది హైపవర్ కమిటీనా.. పవర్ లేని కమిటీనా.. అని ప్రశ్నించారు.

శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ హయాంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ఇంతమంది మహిళలను బాధించిన జగన్మోహన్ రెడ్డిపై దిశ చట్టాన్ని పెట్టాలని అనిత డిమాండ్ చేశారు.

Also Read:పృథ్వీపై అక్కసా, జగన్ మీద కోపమా..., పోసాని ఆసలు సమస్య ఇదే...

గుడికి వెళ్లే మహిళలపై కూడా ముఖ్యమంత్రి తన ప్రతాపం చూపిస్తున్నారంటే.. ఆయనను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌గా లెక్కించాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై సీఎం దాడులు చేయిస్తున్న విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని అనిత కోరారు.

టీడీపీ కార్యకర్తలను టచ్ చేసే మగాడు ఇప్పటి వరకు లేడని.. కాంట్రవర్సీ చేస్తారో కేసులే పెట్టుకుంటారో పెట్టుకోండంటూ అనిత సవాల్ విసిరారు. ఆడవారిపై దాడులు చేస్తుంటే... హోంమంత్రి సుచరిత స్పందించరా అని ఆమె మండిపడ్డారు.

Also Read:రాజధాని తరలింపు, మూడు రాజధానులు: కేంద్రంపై పవన్ కీలక వ్యాఖ్యలు

రాజధాని అమరావతిని రక్షించుకోవడానికి నారా భువనేశ్వరి గాజులిస్తే దానిని కూడా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అనిత దుయ్యబట్టారు. రాజధాని ఉద్యమంలో జరిగే ప్రతి చావుకు ముఖ్యమంత్రి జగన్‌దే బాధ్యతని ఆమె విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్