‘నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. టీడీపీ ఎంపీలకు ఇస్తా’

First Published 5, Jul 2018, 3:15 PM IST
Highlights

*చంద్రబాబుకి ఉండవల్లి లేఖ
*చంద్రబాబుకి మరో ఛాన్స్  వచ్చిందన్న ఉండవల్లి
 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన రాష్ట్ర విభజనకు సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించారు. 

పార్లమెంట్‌ తలుపులు మూసి ఏపీ విభజన చేశారన్న మోదీ ప్రసంగంపై... తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్‌సభలో చర్చకు పట్టుబట్టాలని ఆ లేఖలో కోరారు. రాజ్యాంగ బద్ధంగా విభజన జరగలేదని నిరూపించే అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, టీడీపీ ఎంపీలకు ఇస్తానని ఆయన అన్నారు. 

పార్లమెంట్‌లో చర్చ జరిగితే కాంగ్రెస్, బీజేపీలో విభజన దోషి ఎవరో తేలిపోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడే అవకాశం మరోసారి  వచ్చిందని ఉండవల్లి లేఖలో పేర్కొన్నారు. 

Last Updated 5, Jul 2018, 3:15 PM IST