వైఎస్సార్‌సిపి మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం...తీవ్ర ఉద్రిక్తత (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 16, 2018, 8:14 PM IST
Highlights

తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ శ్రీకాకుళం జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ప్రజల సమస్యలను తీర్చాలంటూ డిమాండ్ చేస్తూ ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష  వైఎస్సార్‌సిపి నియోజకవర్గ ఇంచార్జి పిరియా సాయిరాజ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే వున్న కార్యకర్తలు, పోలీసులు అప్రమత్తమై ఆయన ప్రయత్నాన్ని అడ్డుకోవడం ప్రమాదం తప్పింది.

ఏపి లోని ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిషాలోని పలు ప్రాంతాలను తిత్లీ తుఫాను భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తుపాను దాటికి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా భారీగా నష్టపోయింది. ఈ జిల్లాలో తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఫెను గాలుల కారణంగా భారీ ఆస్తి నష్టంమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరిగింది.

అయితే జిల్లా ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ వైఎస్సార్‌సీపీ నేత సాయిరాజ్ తుపాను భాదితులతో పాటు సోంపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుటు ఆందోళన చేపట్టాడు. ప్రజలకు సరైన ఆహారం, త్రాగు నీరు అందడం లేదని....వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేర్కొంటు ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఎమ్మార్వో కార్యాలయం ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ క్రమంలో పోలీసులకు, వైసిపి కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

వీడియో

click me!