చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏలూరు కోర్టులో చింతమనేని లొంగిపోతాడని ప్రచారం జరుగుతుండటంతో కోర్టు చుట్టూ మఫ్టీలో పోలీసులు మోహరించారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. దాదాపు ఆరు రోజుల నుంచి చింతమనేని కనిపించకుండా మాయమైపోయారు. దీంతో పోలీసులు చింతమనేని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏలూరు కోర్టులో చింతమనేని లొంగిపోతాడని ప్రచారం జరుగుతుండటంతో కోర్టు చుట్టూ మఫ్టీలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు.
undefined
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు పెట్టిన యువకుడికి బెదిరింపులు వస్తున్నాయి. చింతమనేనిపై కేసును విత్‌డ్రా చేసుకోవాలని, లేకుంటే నీ అంతుచూస్తామని జోసఫ్‌ను చింతమనేని ప్రభాకర్ అనుచరులు బెదిరిస్తుండటం గమనార్హం. కాగా కేసులు పెట్టిన వారిని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ పిలిచి మాట్లాడారు. చింతమనేనిపై దాదాపు 50మంది కేసులు పెట్టడం గమనార్హం.
read more news
అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే చింతమనేని
పోలవరం పైపులు చోరీ చేశాడు:చింతమనేనిపై పోలీసులకు ఫిర్యాదు
ఇసుక కొరతపై ఆందోళన... చింతమనేని గృహ నిర్భందం
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు