వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు

Published : Jul 05, 2018, 03:49 PM IST
వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు

సారాంశం

*వైసీపీలోకి మరో కీలక నేత *జగన్ కోసం ఏదైనా చేస్తానంటున్న యువనేత

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి ఈనెల 7న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..బైరెడ్డి రాజశేఖరరెడ్డితో  తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

 జగన్‌ను సీఎం చేసేందుకు ఎవరితోనైనా కలసి పనిచేస్తానని సిద్దార్థరెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నందికొట్కూరులో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. తనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సిద్దార్థరెడ్డి పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?