దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి కన్నుమూత..

By AN Telugu  |  First Published Jun 1, 2021, 9:39 AM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల మాజీ శాసనసభ్యుడు అవుతు రామిరెడ్డి (86) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కరోనా సోకిన ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన అల్లుడు గుదిబండి చిన్న వెంకటరెడ్డి తెలిపారు. 

తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కొల్లిపరలోని రామిరెడ్డి కుటుంబసభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుగ్గిరాల, ఈమనిలో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. 

Latest Videos

అవుతు రామిరెడ్డి 1967-72లో ఎమ్మెల్యేగా, 1981-86 కాలంలో ఈమని సమితి అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 

ఆయన మృతికి దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, అవుతు కృష్ణారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, జొన్నల శివారెడ్డి, కళ్లం వీరారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, ఈమని హరికొటిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. 

click me!