సెలక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యమని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమన్నారు. నిన్న తాము అడిగిన సెలక్ట్ కమిటీ మండలికి సంబంధించినది మాత్రమేనని చెప్పారు. జాయింట్ సెలక్ట్ కమిటీ అడిగి ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందులో సభ్యులుగా ఉంటారని చెప్పారు. తాను సెలక్ట్ కమిటీకి ఛైర్మన్ గా కూడా పనిచేశానని చెప్పారు.
శాసన మండలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. గురువారం మీడియా ముందు మాట్లాడిన ఆయన పలు షాకింగ్ విషయాలు తెలియజేశారు.
శాసనమండలికి నిన్న పలువురు వైసీపీ సభ్యులు మద్యం తాగి వచ్చారని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు.గుట్కాలు నమిలారని... చైర్మన్‌ను దూషించారని తెలిపారు. లోకేష్‌పై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. టీడీపీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారని... అందుకనే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
Also Read సెలెక్ట్ కమిటీకి రెండు బిల్లులు: జగన్ సర్కార్ ముందున్న అవకాశాలివీ.
సెలక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యమని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమన్నారు. నిన్న తాము అడిగిన సెలక్ట్ కమిటీ మండలికి సంబంధించినది మాత్రమేనని చెప్పారు. జాయింట్ సెలక్ట్ కమిటీ అడిగి ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందులో సభ్యులుగా ఉంటారని చెప్పారు. తాను సెలక్ట్ కమిటీకి ఛైర్మన్ గా కూడా పనిచేశానని చెప్పారు.
సెలక్ట్ కమిటీ ఏర్పాడ్డాక ప్రజాభిప్రాయం కూడా తీసుకోవచ్చన్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి సెలక్ట్ కమిటీకి తగినంత సమయం అవసరమన్నారు. ఈ ప్రక్రియ ముగియడానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చన్నారు. సెలక్ట్ కమిటీ నిర్ణయానికి కనీస సమయం మూడు నెలలు అని అన్నారు. దాని అర్థం మూడు నెలలలోపు ఇవ్వమని కాదని చెప్పారు. మండలి రద్దుకు తాము బాధపడమని, భయపడమని చెప్పారు.