సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు: జరిగేది ఇదీ...

By narsimha lode  |  First Published Jan 23, 2020, 7:45 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్ డీ ఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపింది.దీంతో సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటనే చర్చ ప్రస్తుతం సాగుతోంది.


అమరావతి:పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంతో శాసనమండలిలో టీడీపీ పై చేయి సాధించింది.  అయితే శాసనమండలి సెలెక్ట్ కమిటీని ఎలా ఎంపిక చేస్తారు.. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారనే విషయమై కూడ ప్రస్తుతం ఆసక్తిరంగా మారింది. 

Also read:శాసనమండలిలో ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదం, గ్యాలరీలో బాబు

Latest Videos

undefined

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంతో అధికార వైసీపీపై టీడీపీ పైచేయి సాధించింది. ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. అయితే సెలెక్ట్ కమిటీకి ఎంత కాలం గడువు ఉండాలనే విషయాన్ని శాసనమండలి ఛైర్మెన్ నిర్ధేశిస్తారు.

బిల్లు ప్రవేశపెట్టిన మంత్రే సెలెక్ట్ కమిటీకి ఛైర్మెన్ గా ఉంటారు. అయితే శాసనసభలో ఆయా పార్టీల బలబలాల ఆధారంగా సెలక్ట్ కమిటీలో సభ్యులను నియమిస్తారు. నిర్ధేశించిన బిల్లులపై (పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు) పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత సవరణలను సూచించవచ్చు. సెలెక్ట్ కమిటీ నివేదికను శాసనమండలికి సమర్పించాల్సి ఉంటుంది.

 సెలెక్ట్ కమిటీ శాసనమండలికి సమర్పించిన నివేదికపై  శాసనమండలి తిరిగి చర్చించనుంది. శాసనమండలి చర్చించి అవసరమైన సవరణలను చేస్తోంది. ఆ తర్వాత ఈ బిల్లును తిరిగి శాసనసభకు పంపనున్నారు. 

శాసనమండలి నుండి తిరిగి వచ్చిన బిల్లులోని సవరణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేది ప్రభుత్వం ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.ఈ సమయంలో మరోసారి శాసనసభలో ప్రభుత్వం తమకు అవసరమైన రీతిలో బిల్లును ప్రవేశపెట్టనుంది.అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన తిరిగి శాసనమండలికి పంపుతారు.

శాసనమండలికి మరోసారి బిల్లును పంపుతారు. ఈ బిల్లును రెండోసారి శాసనమండలి ఆమోదించినా ఆమోదించకపోయినా కూడ నేరుగా బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు.

 

click me!