జగన్ వల్లే ఏపీకి సున్నా.. కేంద్ర బడ్జెట్ పై యనమల కామెంట్స్

By telugu teamFirst Published Feb 1, 2020, 3:21 PM IST
Highlights

వైసీపీ అవినీతి, అసమర్థ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులు రాబట్టే సామర్థ్యం సీఎం జగన్ లో లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గత 8నెలల్లో అభివృద్ధి పనులన్నీ ఆపేశారన్నారు. పోలవరం సహా, ప్రాజెక్టుల పనులన్నీ నిలపేశారని మండిపడ్డారు.
 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే... ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి మొండి చెయ్యి చూపించారు. దీనిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించాడు. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్ర బడ్జెట్ పూర్తైన తర్వాత యనమల మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తుగ్లక్ చర్యల వల్లే  కేంద్ర బడ్జెట్ లో ఏపీ కి నిధులు శూన్యమయ్యాయన్నారు.

వైసీపీ అవినీతి, అసమర్థ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులు రాబట్టే సామర్థ్యం సీఎం జగన్ లో లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గత 8నెలల్లో అభివృద్ధి పనులన్నీ ఆపేశారన్నారు. పోలవరం సహా, ప్రాజెక్టుల పనులన్నీ నిలపేశారని మండిపడ్డారు.

Also Read ఏపీకి కేంద్రం మొండి చేయి: బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు

రాజధానికి నిధులు వద్దని ప్రధాని ఇచ్చిన తొలి వినతిలో జగన్ చెప్పారని ఆరోపించారు. పీపీఏలను రద్దు చేయడం సీఎం మొదటి తిక్కపని అని అన్నారు. 5 దేశాల ఎంబసీలు హెచ్చరించాయని..కేంద్రం చెప్పింది, కోర్టులు ఆదేశించాయన్నారు. అయినా జగన్ తన మూర్ఖత్వం వీడలేదన్నారు.

జగన్ కారణంగానే ఏపీకి వచ్చే నిధులు  రాకుండా పోతున్నాయన్నారు.  సింగపూర్, కియా ఆగ్జిలరీ యూనిట్లు, డేటా సెంటర్, రిలయన్స్, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అన్నీ వెళ్లిపోయాయని ఆరోపించారు.  8నెలల్లోనే రూ లక్షల కోట్ల పెట్టుబడులు పోగొట్టారని మండిపడ్డారు.  3రాజధానుల నిర్ణయం.. ఇప్పుడింకో తుగ్లక్ చర్య’ అని మాజీ ఆర్థిక మంత్రి విమర్శలు గుప్పించారు.

click me!