ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ పెదవి విరిచింది.
అమరావతి: ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మొండి చేయి చూపిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.శనివారం నాడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.
ఏపీకి ప్రత్యేక కేటాయింపులు కేంద్రం చేయలేదని విజయసాయిరెడ్డి చెప్పారు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం అవసరమని ఎ:పీ విజయసాయిరెడ్డి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతుల్లో అనుబంధాలను పరిశీలించిన తర్వాత కేంద్రం ఏపీకి ఏ మేరకు కేటాయింపులు చేసిందో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. బడ్జెట్ అనుబంధప్రతులు చూసిన తర్వాత దీనిపై తాము స్పందిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.
ప్రత్యేక హోదా అంశాన్ని ఎలా చేస్తారో ప్రస్తావించలేదని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రైతుల ఆదాయం ఎలా రెట్టింపు చేస్తారో చెప్పలేదన్నారు.