చంద్రబాబుపై కసి ఉంటే ముక్కలుగా నరికి చంపేయ్: జగన్ పై జేసీ సంచలనం

Published : Feb 01, 2020, 01:00 PM IST
చంద్రబాబుపై కసి ఉంటే ముక్కలుగా నరికి చంపేయ్: జగన్ పై జేసీ సంచలనం

సారాంశం

చంద్రబాబు మీద కసి ఉంటే ముక్కలు ముక్కలుగా నరికి చంపేయ్, నా మీద కోపం ఉంటే సర్వనాశనం చేయ్ అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు. జగన్ కు అమ్మ అంటే గౌరవం లేదని జేసీ అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అమ్మ అంటే గౌరవం లేదని, అక్క అంటే గౌరవం లేదని, అసలు ఆడవాళ్లంటేనే గౌరవం లేదని తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తుళ్లూరులో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆయన వైఎస్ జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కియా కంపెనీ పెట్టడంతో చుట్టూ 45 కిలోమీటర్ల మేర రియల్ ఎస్టేట్ భూమి పెరిగి అక్కడున్న రైతులకు ఆసరాగా నిలిచాడని ఆయన అన్నారు. అక్కడ ఎకరం 50 లక్షలకు ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారని జేసీ చెప్పారు.ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయానికి అక్కడ రైతులు పూర్తిగా నష్టపోయారని ఆయన అన్నారు. 

అమ్మ అంటే గౌరవం లేదు అక్క అంటే గౌరవం లేదు అసలు ఆడవాళ్లంటే గౌరవం లేకుండా పోయే స్థాయికి మారిపోయాడని ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని, అతను ఇక్కడ రాజధాని పెట్టి ఇక్కడ టూరిజం డెవలప్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్ళాలనే ప్రయత్నం చేశాడని ఆయన అన్నారు.

నూటికి నూరు శాతం రాజధాని ఇక్కడి నుంచి తరలించడం జగన్ వల్ల కాదని, రాజధానిలో కమ్మ పరిపాలన సాగుతుంది అంటున్నాడని, అక్కడ రెడ్లు ఉన్న ప్రాంతానికి చంద్రబాబు కియా కంపెనీ తెచ్చి అక్కడి రెడ్లను ఆదుకో లేదా అని అన్నాడు.  తండ్రి పేరు నిలబెట్టాలి గాని తండ్రి పేరు చెడగొట్ట కూడదని ఆయన జగన్ కు సలహా ఇచ్చారు. 

"నీకు చేతనైతే చంద్రబాబు నాయుడు మీద కసి   ఉంటే చంద్రబాబు నాయుడిని చంపేయ్ ముక్కలు ముక్కలుగాఅలాగే నా మీద కోపం ఉంటే జెసి దివాకర్ కుటుంబాన్ని సర్వ నాశనం చేసి రోడ్డు మీద అడ్డుకునే విధంగా చేయి" అని జేసీ అన్నారు. జగన్ ఎలక్షన్లోకి వచ్చినప్పుడే కులాల పిచ్చి మొదలైదని,

 జగన్ కు  పెళ్లిళ్ల విషయంలో కులాలు పట్టింపు లేదని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి  రాజశేఖర్ రెడ్డి  మాట వినడు తాత మాట వింటాడని అన్నారు. రాజారెడ్డి కలలోకొచ్చి జగన్ కు ఒక మాట చెప్పి మనసు మార్చాలని కోరుకుంటున్నానని అన్నారు.సెక్రటరీ రాష్ట్రానికి మెదడు లాంటిది మిగతా శాఖలు ఎక్కడైనా పెట్టుకోఅభ్యంతరం లేదని, 

రాజధానిలో మహిళలు శాపాలు ఉసురు తప్పని సరిగా తగిలిందని ఆయన అన్నారు. 46 రోజుల నుంచి మహిళలు దీక్ష చేస్తుంటే ముఖ్యమంత్రి కి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని అయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!