పార్టీలతో సంబంధం లేదు.. అర్హత వుంటే నారా దేవాన్ష్‌కూ అమ్మఒడి : వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Oct 28, 2022, 04:23 PM IST
పార్టీలతో సంబంధం లేదు.. అర్హత వుంటే నారా దేవాన్ష్‌కూ అమ్మఒడి : వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి వ్యాఖ్యలు

సారాంశం

అర్హత వుంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి వర్తింపజేస్తామన్నారు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ . గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన తన నియోజకవర్గంలో పర్యటించారు.

మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్హత వుంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి వర్తింపజేస్తామన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నివాసానికి కూడా వెళ్లారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాన్ని వర్ల రామయ్య నివాసంలో ఆయన డ్రైవర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. తాము ఏ పార్టీ అని చూడటం లేదని, అర్హత వున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. వర్ల రామయ్యకు కూడా రైతు భరోసా ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. 

ఇకపోతే..  గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో విజయవాడలో పర్యటిస్తున్న ఆయనకు నిరసన సెగ తలిగింది. చెత్తపన్ను భారం మోయలేకపోతున్నామని 50వ డివిజన్‌కు చెందిన నాగబాబు  అనే యువకుడు వెల్లంపల్లి ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావించి నిలదీశారు. దీంతో మాజీ మంత్రి ఆవేశంతో ఊగిపోయాడు. తనపై ఆరోపణలు చేసిన యువకుడిపై కేసు పెట్టాలని సీఐని ఆదేశించారు. అవినీతి ఆరోపణలను రుజువు చేయకుంటే లోపలేయాని సీఐతో అన్నారు. 

ALso Read:ప్రశ్నిస్తే జేసీబీతో తొక్కించేస్తారా ... వైసీపీ రాక్షస పాలనకు పరాకాష్ట : జగన్‌పై నారా లోకేశ్ ఆగ్రహం

అసలేం జరిగిందంటే.. గడప గడపకు వైసీపీలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి ముందు ఓ యువకుడు ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావించాడు. దీంతో ఆవేశానికి లోనైన వెల్లంపల్లి.. ‘‘పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. టీడీపీ వాళ్లు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావ్.. నీ మీద కేసు పెట్టమంటవా?’’ అని అన్నారు. చెత్త పన్ను గురించి మాట్లాడుతుండగా.. చెన్నైలో ఉండేవాడివి ఇక్కడ నీకేం సంబంధం అని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ఆ యువకుడు మధ్యలో మాట్లాడే ప్రయత్నం చేయగా అతడిని నోర్ముయ్ అని గట్టిగా వారించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్