ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పరిరక్షించండి.. నిరాహారదీక్షకు దిగిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు

First Published Jul 13, 2018, 11:32 AM IST
Highlights

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షకు దిగారు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ఎన్నో ఏళ్లుగా దళిత, గిరిజనులకు రక్షణ కవచంలా ఉన్న అట్రాసిటీ చట్టం ప్రమాదంలో పడిందని.. సుప్రీంకోర్టు తీర్పుతో దళితుల్లో ఆందోళన  నెలకొందని కిశోర్ బాబు అన్నారు.. ఈ చట్టాన్ని పరిరక్షించేందుకు కేంద్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..

కిశోర్ బాబు దీక్షకు దళిత, గిరిజన సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.. ఇవాళ రాత్రి ఏడు గంటల వరకు ఆయన నిరాహారదీక్ష కొనసాగుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినిగమవుతుందని... ఈ కేసుల్లో తక్షణ అరెస్టులు ఉండకూడదని.. ప్రాథమిక విచారణ తప్పనిసరని చెబుతూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

click me!