చంద్రబాబుపై మాట మార్చిన కృష్ణం రాజు

First Published 13, Jul 2018, 11:24 AM IST
Highlights

 ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని మొన్నటికి మొన్న మండిపడ్డ కృష్ణం రాజు.. చంద్రబాబుపై ప్రశంసంల వర్షం కురిపించారు.

సినీనటుడు, బీజేపీ నేత కృష్ణం రాజు.. ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో తన మాటను పూర్తిగా మార్చేశారు. మొన్నటికి మొన్న చంద్రబాబు పాలనపై, ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన ఇప్పుడు.. పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు.

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతివారం ఐదు ప్రశ్నలు అడుగుతుంటే వాటికి పొంతనలేకుండా సమాధానమిస్తూ టీడీపీ నేతలు ప్రజలను గందరగోళపరుస్తున్నారని,  కన్నా లక్ష్మీనారాయణపై చెప్పులు వేసి రౌడీయిజం చేస్తున్నారని .. ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని మొన్నటికి మొన్న మండిపడ్డ కృష్ణం రాజు.. చంద్రబాబుపై ప్రశంసంల వర్షం కురిపించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పవన్, జగన్‌లకు బీజేపీ స్క్రిప్ట్‌ ఇస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. పాటలు, స్కిట్స్ ద్వారా ప్రజలకు నిజాలు తెలియజేయనున్నట్లు ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలో ఎక్కడా బీజేపీపై నెగిటివ్ అభిప్రాయం లేదని కృష్ణంరాజు అన్నారు. 

Last Updated 13, Jul 2018, 11:24 AM IST