రమణ దీక్షితులకు షాక్..టీటీడీపై సీబీఐ విచారణ అవసరం లేదన్న కేంద్ర న్యాయశాఖ

First Published Jul 13, 2018, 11:07 AM IST
Highlights

ఆగమ శాస్త్రానికి అవమానం జరుగుతోందని.. స్వామి వారి నగలకు రక్షణ లేకుండా పోతుందని.. వీటన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలంటూ రమణ దీక్షితులు చేసిన డిమాండ్‌పై కేంద్ర న్యాయశాఖ స్పందించింది

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులకు కేంద్ర న్యాయశాఖ వద్ద చుక్కెదురైంది. శ్రీవారి ఆలయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని.. ఆగమ శాస్త్రానికి అవమానం జరుగుతోందని.. స్వామి వారి నగలకు రక్షణ లేకుండా పోతుందని.. వీటన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలంటూ రమణ దీక్షితులు చేసిన డిమాండ్‌పై కేంద్ర న్యాయశాఖ స్పందించింది..

ఈ పరిణామాలపై సీబీఐ విచారణ జరిపించలేమని.. వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని వెల్లడించింది. దీంతో రమణ దీక్షితులుతో పాటు రిటైర్ అయిన మిరాశీ అర్చకులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. న్యాయ నిపుణులతో సంప్రదించి తదుపరి కార్యాచరణపై వారు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

click me!