కాపులకు ముఖ్యమంత్రి పదవి.. మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 27, 2022, 6:23 PM IST
Highlights

రాష్ట్రంలో జరుగుతున్న కాపు నాడు సమావేశాలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. సమాజాన్ని నడిపించే వ్యక్తి వచ్చినప్పుడు రాష్ట్రానికి కాపు నేత సీఎం కావొచ్చన్నారు. పవన్ కల్యాణ్‌ సీఎం పదవి తనకు వద్దు మొర్రో అంటున్నారని నాని సెటైర్లు వేశారు.  

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న కాపు నాడు సమావేశాలపై స్పందించారు. రాష్ట్రానికి కాపు వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావడం తప్పేం కాదన్నారు. అయితే సమాజాన్ని నడిపించే వ్యక్తి వచ్చినప్పుడు రాష్ట్రానికి కాపు నేత సీఎం కావొచ్చన్నారు. హరిరామజోగయ్య దీక్షను స్వాగతిస్తున్నానని పేర్ని నాని అన్నారు. పవన్ కల్యాణ్‌ సీఎం పదవి తనకు వద్దు మొర్రో అంటున్నారని ఆయన సెటైర్లు వేశారు.  

కమ్యూనిస్ట్ నేతలపై విమర్శలు గుప్పించారు . నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కావాలని కోరుకోరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు పారిపోయారని నాని ప్రశ్నించారు. నిజమైన కమ్యూనిస్టులు పేదల బాగుకోసం పోరాడతారని నాని అన్నారు. పేదోడికి ఇంటి పట్టా ఇవ్వొద్దని వాదించేవాడికి మద్ధతిచ్చేవారు కమ్యూనిస్టులా అని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టుల్లో అసలు కమ్యూనిజం వుందా అని పేర్ని నిలదీశారు. 

Also Read: వాళ్లకు రాజ్యాధికారం లేదా, 35 మంది ఎమ్మెల్యేలున్నారు.. కాపులకు మెచ్యూరిటీయే లేదు : మాజీ సీఎస్ రామ్మోహన్ రావు

చంద్రబాబును సీఎం చేయడమే వారి లక్ష్యమని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తారని పేర్ని నాని చురకలంటించారు. సీపీఐ రామకృష్ణ కమ్యూనిస్ట్ సిద్ధాంతం పాటిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ప్రజలే తేలుస్తారని నాని స్పష్టం చేశారు. విడివిడిగా పోటీ చేయడానికి మీకు ఎందుకంత భయమంటూ ఆయన చురకలంటించారు. అసత్యాలను నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వాక్ స్వాతంత్ర్యం పోయిందంటూ మాట్లాడటం విడ్డూరంగా వుందని పేర్ని నాని మండిపడ్డారు.  

click me!