ఏలూరు జిల్లా : రెస్టారెంట్‌పై పేలిన హీలియం బెలూన్.. చిన్నారులకు గాయాలు

Siva Kodati |  
Published : Dec 27, 2022, 05:40 PM IST
ఏలూరు జిల్లా : రెస్టారెంట్‌పై పేలిన హీలియం బెలూన్.. చిన్నారులకు గాయాలు

సారాంశం

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఓ రెస్టారెంట్‌పై ఏర్పాటు చేసిన హీలియం బెలూన్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు.   

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో హీలియం గ్యాస్ బెలూన్ పేలింది. ఓ రెస్టారెంట్‌పై హీలియం గ్యాస్ బెలూన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలో మంగళవారం బెలూన్ పేలి.. మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  
 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna