జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు .. గిల్లినప్పుడు, గిల్లించుకోవాల్సిందే : చిరంజీవికి పేర్ని నాని కౌంటర్

Siva Kodati |  
Published : Aug 08, 2023, 04:22 PM ISTUpdated : Aug 08, 2023, 04:23 PM IST
జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు .. గిల్లినప్పుడు, గిల్లించుకోవాల్సిందే  : చిరంజీవికి పేర్ని నాని కౌంటర్

సారాంశం

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్నినాని. దాడికి ఎదురుదాడి సహజమని.. గిల్లితే , గిల్లించుకోవాల్సిందేనని పేర్నినాని వ్యాఖ్యానించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా వున్నప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్ని నాని దుయ్యబట్టారు. 

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్నినాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడైనా ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా వున్నప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్ని నాని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి ఏ పార్టీలో వున్నారు అంటూ ఆయన నిలదీశారు.

ఎవరైనా సినిమాను సినిమాగా చూడాలి.. రాజకీయాలను రాజకీయంగా చూడాలని పేర్ని నాని చురకలంటించారు. హైదరాబాద్ ఫిలింనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఎంత దూరమో, ఏపీ సచివాలయం నుంచి హైదరాబాద్ ఫిలింనగర్‌కు కూడా అంతే దూరమన్నారు. దాడికి ఎదురుదాడి సహజమని.. గిల్లితే , గిల్లించుకోవాల్సిందేనని పేర్నినాని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకుండా రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరి ప్రభుత్వమని చిరంజీవిపై మండిపడ్డారు. అప్పుడు నా హీరో కేంద్ర మంత్రిగా వున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

ALso Read: సినీ పరిశ్రమపై పడ్డారు.. రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టండి.. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఆగ్రహం..

అంతకుముందు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై  మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రభుత్వం ఎలా ఉండాలో వారు సలహా ఇస్తున్నారన్నారు. ఆ పకోడిగాళ్లు తనవాళ్లకు సలహాలు ఇచ్చుకోవచ్చు కదా అని ఆయన సెటైర్లు వేశారు. రాజకీయాలు ఎందుకు  , డ్యాన్సులు, ఫైట్స్, యాక్షన్ గురించి మనం చూసుకుందామని చెప్పొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. సినీ ఇండస్ట్రీలో  చాలా మంది పకోడిగాళ్లున్నారని   దుయ్యబట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!