పుంగనూరు గొడవకు కుట్రదారుడు బాబే: లోకేష్ పై పేర్నినాని ఫైర్

Published : Aug 08, 2023, 03:52 PM IST
పుంగనూరు గొడవకు కుట్రదారుడు బాబే: లోకేష్ పై పేర్నినాని ఫైర్

సారాంశం

పుంగనూరు అల్లర్ల కుట్రకు చంద్రబాబు ప్రధాన కుట్రదారుడని  మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

తాడేపల్లి:చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి కళ్లకు  ఆపరేషన్ చేయిస్తాననడం  లోకేష్ బలుపునకు  నిదర్శనంగా  ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.మంగళవారంనాడు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  పోలీసులకు కులం, మతం ఉంటుందా అని ఆయన  ప్రశ్నించారు. పోలీసులు లేకపోతే  లోకేష్ గడప దాటి అడుగు పెట్టడని  నాని విమర్శించారు. 

  అధికారం  కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడన్నారు. పోలీసులపై దాడులు చేసి  అల్లర్లు సృష్టించాలని  పుంగనూరులో  చంద్రబాబు ప్లాన్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని  ఆరోపించారు. పుంగనూరులో  గొడవకు  చంద్రబాబే ప్రధాన కుట్రదారుడని ఆయన ఆరోపించారు.పుంగనూరు ఘటనలో  చంద్రబాబును మొదటి ముద్దాయిగా పరిగణించాలని  పేర్ని నాని  డిమాండ్  చేశారు. 

also read:కొట్టండ్రా, తరమండ్రా అంటూ చంద్రబాబు రెచ్చొగొట్టాడు.. ఆ కేసులతో వైసీపీకి సంబంధం లేదు : పెద్దిరెడ్డి

పుంగనూరులో చంద్రబాబు రౌడీయిజానికి  పాల్పడ్డారన్నారు. పుంగనూరుకు రావడానికి ముందు రోజే రాళ్లు, కర్రలు దాచి పెట్టారని మాజీ మంత్రి చెప్పారు.పక్కా పథకం ప్రకారం చంద్రబాబు  పుంగనూరులో దాడి చేశాడని  మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు.పక్క జిల్లాల నుండి రౌడీలను తీసుకు వచ్చి  పుంగనూరులో గొడవలకు  బాబు కారణమయ్యాడన్నారు.పోలీసులపై దాడులు చేసి కాల్పులు జరగాలని చంద్రబాబు చూశాడన్నారు. కానీ పోలీసులు చాలా సంయమనంతో వ్యవహరించారని పేర్ని నాని చెప్పారు.పుంగనూరులో  35 ఏళ్లుగా గెలుస్తున్న పెద్దిరెడ్డి నిజంగా మొగాడే అని పేర్ని నాని కితాబిచ్చారు.1995 నుండి రాయలసీమకు నీళ్లివ్వకుండా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!